రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థ (డైట్)ల్లో ఇంగ్లిష్ మీడియంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్/డీఎల్‌ఈడీ) కోర్సు ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
🌻ఒక్కో సంస్థలో 50 సీట్ల చొప్పున రెండేళ్ల డీఎడ్ కోర్సు నిర్వహణకు అనుమతిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం ఉత్తర్వులు (జీ.వో.ఎం.ఎ్‌స.నెం.28) జారీచేశారు.
🌻 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఆయా సంస్థల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలోని 30 ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో మొత్తం 1700 సీట్లకు 2017-18 విద్యా సంవత్సరం నుంచే తెలుగు మీడియానికి సమాంతరంగా ఇంగ్లిష్ మీడియంలో డీఎడ్ కోర్సును నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం గత ఏడాదే అనుమతిచ్చింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇