*ఏపీటీఎఫ్: ఈరోజు నూతన విద్యాశాఖా మాత్యులుగా శ్రీ ఆదిమూలపు సురేష్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏపీటీఎఫ్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగింది. అమ్మ మోడీని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిమితం చేయాలని కోరడం జరిగింది. డిఎస్సి నియామకాలు సత్వరం పూర్తి చేయాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరడం జరిగింది. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి టి.దస్తగిరి, కృష్ణా జిల్లా నాయకులు కె.చంద్రశేఖర బాబు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.*