🔸ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది.*
*🔹సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువు మరో నెలరోజులు పెంచింది. ‘ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్టు 31, 2019 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పెంచింది.*
*🔸వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.*
*🔹ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా.. రిటర్నులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.*
*🔸ఈ గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. దీనికిగాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.*
*🌺డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000.*
*👉ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.. మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాలి.*
..................
The Central Board of Direct Taxes (CBDT)* extends the ‘due date’ for filing of *Income Tax Returns from 31st July, 2019 to 31st August, 2019* in respect of certain categories of taxpayers who were liable to file their Returns by *31.07.2019.*
*K.VENKATESWARA RAO* *G.HRUDYA RAJU* PR& GS