మిత్రులారా!
నేడు కర్నూలు జిల్లాలో పిఆర్టీయు (ఒక వర్గం ) *జిల్లా అధ్యక్షులు యన్.రమేష్* గారు మరియు కార్యవర్గ సభ్యులు గాంధీనగర్ లోని జిల్లా ఏపీటీఎఫ్ కార్యాలయం నందు *ఏపీటీఎఫ్ లో చేరడం జరిగింది*. ఆ మేరకు *ప్రాధమిక సభ్యత్వాన్ని* ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు ఏ.కమలాకర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు , రాష్ట్ర కార్యదర్శి యస్.ఇస్మాయిల్, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె.సాంబశివుడు, టి.వి.రామకృష్ణయ్య ల సమక్షంలో స్వీకరించారు. ఫెడరేషన్ వారిని ఆత్మీయంగా ఆహ్వానించి అభినందనలు తెలియజేసింది.
ఈ సందర్భంగా యన్.రమేష్ మాట్లాడుతూ ఏపీటీఎఫ్ సంఘం నిబంధనావళి నచ్చి , విద్యారంగ- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేయుట, రాష్ట్ర - జిల్లా స్థాయిలో నాయకుల పనితీరు, సంఘంలో ప్రజాస్వామ్య వాతావరణం ఉండడం, సంఘంలో చాలా మంది మిత్రులుండడం తదితర కారణాల రీత్యా ఆకర్షితుడనయ్యి చేరినట్లు తెలిపారు. నేను నాతో పాటు సంఘంలో చేరిన మిత్రులు సంఘ నిబంధనావళికి లోబడి ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో దాదాపు 30మంది ఏపీటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఏపీటీఎఫ్ జిల్లా శాఖ, కర్నూలు