ఏపీటీఎఫ్: ఈరోజు విద్యాశాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు విద్యారంగ- ఉపాధ్యాయుల సమస్యలను వివరించారు.
👉 బదిలీలు: ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ ను సంప్రదించి దసరా సెలవుల్లో నిర్వహించాలా ... లేదా... తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
👉 అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం పునరాలోచించాలి.
👉 ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధనకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని లేదా యాజమాన్యాల వారిగా అన్ని కేడర్ల పదోన్నతులు చేపట్టాలని కోరడం జరిగింది.
👉 అప్గ్రేడెడ్ పోస్టులు కేటగిరి3 నుండి కేటగిరి 2 కు అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది.
👉 అంతర్ రాష్ట్ర, జిల్లా, సాధారణ బదిలీలు జరపాలని, జె.యల్ పదోన్నతులు, పిఈటీ, ఎంఈవో,హెచ్.యమ్ , మున్సిపాలిటీ, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్ తదితర అన్ని సమస్యలను వివరించడం జరిగింది.
మంత్రి ఆర్థికంతో సంబంధం లేని ఎటువంటి సమస్యలనైనా speedup చేస్తానని, మిగతా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం తప్ప ఎటువంటి నిర్ణయం గాని, స్పష్టత గాని ఈ సమావేశంలో ఇవ్వలేదనేది తెల్పడమైనది.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్ర.కా
జి.హృదయరాజు తో పాటు రాష్ట్ర కార్యదర్శి టి.దస్తగిరి, గుర్తింపు పొందిన సోదర సంఘ నాయకులు పాల్గొన్నారు.