AP:
వచ్చే ఏడాది మార్చి 2020లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులకు విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటన చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. *ఎటువంటి అపరాధ రుసుము లేకుండా.. అక్టోబర్ 29వ తేదీలోగా సదరు పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అపరాధ రుసుమును మూడు దశల్లో చెల్లించే ఏర్పాటు చేశారు. నవంబరు 13వ తేదీలోగా అయితే రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.అలాగే నవంబరు 27వ తేదీలోగా అయితే రూ. 200, ఆఖరి అవకాశంగా.. డిసెంబర్ 11వ తేదీలోగా.. రూ. 500లు మేరకు* అపరాధ రుసుమును చెల్లించాలి.