నేను 1996 డిసెంబరు లో SGT గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత
నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే
ఇంక్రిమెంట్ ను డిసెంబరుకి మార్చుకొనే అవకాశం లేదా?
జవాబు:
జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి
మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో DEO ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి
విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసుగా పరిగణించబడుతుంది