ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై
కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా
కమ్యూటెడ్
సెలవుగా పరిగణించాలా?
✍
ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా
ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి
వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319
F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై
వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల
కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.