➤పది పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు
➤ఒక్కో పేపరు 50 మార్కులు.. బిట్ పేపర్ తొలగింపు
➤గతేడాది వరకు ఉన్న అంతర్గత మార్కులు 20% తొలగింపు.
➤హిందీ/సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 10 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకునేందుకు మరో ఐదు నిమిషాలు చివరిలో జవాబులు సరి చూసుకునేందుకు ఇవ్వనున్నారు.
➤హిందీ/సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు.
➤ రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత. సబ్జెక్టు వారీగానే చూస్తారు తప్ప ప్రశ్నపత్రం వారీగా ఉండదు.
➤బిట్ పేపర్ ప్రత్యేకంగా ఉండదు. ప్రశ్నపత్రంలోనే ఐదు రకాల సూక్ష్మ లఘు ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపర్చడం, ఒక పదంలో సమాధానం, ఏది సరైనది- ఏది కాదు,కార్యకారణ సంబంధ ప్రశ్నలు ఉంటాయి.
➤ 18 పేజీల సమాధాన బుక్లెట్ ఇవ్వనున్నారు. మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇందులోనే రాయాల్సి ఉంటుంది.
➤ ఒక మార్కు ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబివ్వాలి. రెండు మార్కుల ప్రశ్నలకు రెండు, మూడు లైన్లలో సమాధానం ఇవ్వాలి. వ్యాసరూప ప్రశ్నలకు 8-10 వాక్యాలు రాయాల్సి ఉంటుంది.
➤విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ప్రశ్నలు ఇస్తారు.