*ఎస్ఎంసీలకు గ్రీన్ చానల్ పీడీ ఖాతాలు*
*ఏపీ:* పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) బ్యాంకు ఖాతాలకు నిధుల కేటాయింపు, విడుదలలో ఎటువంటి అవరోధాలు ఎదురు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. అమరావతిలో గురువారం జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయిసమావేశంలో పాఠశాలలకు సంబంధించిన అన్ని రకాల బ్యాంకు ఖాతాలను గ్రీన్ చానల్ కు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎంసీ, సీఆర్సీలు, ఎమ్మార్సీలకు ప్రత్యేకంగా గ్రీన్ చానల్ పీడీ అకౌంట్లు ప్రారంభించాలని ఆదేశిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర పీడీ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా పీడీలు సమన్వయంతో పనిచేసి గ్రీన్ చానల్ ఖాతాలు ప్రారంభింపజేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. వెంటనే బ్యాంకు ఖాతాలు ప్రారంభించి సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
instructions.... Opening of Green Channel PD Accounts to the SMC , MRC, School Complex Accounts Rc.2453,Dt.4/10/2019