ఏపీటీఎఫ్ నేతలుగా హృదయరాజు , వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా జి.హృదయరాజు , ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటేశ్వరరావులు ఎన్నికయ్యారు .
గౌరవ అధ్యక్షులుగా ఎ . సదాశివరావును ఎన్నుకున్నారు . విజయవాడ పటమటలోని విశ్వభారతి విద్యానికేతన్ భవనం ఆవరణ లో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆదివారం సమావేశమయింది . కొత్త కార్యవర్గ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు . ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది .అసోసియేట్ అధ్యక్షులుగా కె.కులశేఖర్ రెడ్డి , ఉపాధ్యక్షులుగా టి.చంగలాయమందడి , పి.వి.సుబ్బారావు , జె.విజయానంద్ , ఎన్.మోహన్ దాస్ , అదనపు కార్యదర్శిగా ఆర్.కృష్ణ , కార్యదర్శులుగా కె.పాపారావు , టి.దస్తగిరి , సీహెచ్ . దిలీప్ కుమార్ , వై.వెంకట్రాజు , ఎస్.చిరంజీవి , మసిలామణి , వై.శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు . కార్యవర్గ సభ్యులను , ఐఫియా కౌన్సిలర్స్ , క్రమశిక్షణ కమిటీ , ఆడిట్ కమిటీ , అకడమిక్ కమిటీ , మహిళా ప్రతినిధుల కమిటీ , మైనారిటీ కమిటీ , గిరిజన విభాగాల నూతన కమిటీలను ఎన్నుకున్నారు . ఈ విషయాన్ని ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన యం.వెంకట సుబ్బయ్య , యం.డి. వరకుమార్ లు తెలిపారు . కొత్త కమిట ప్రమాణస్వీకారం చేసింది .
టీచర్లను బలవంతంగా స్కూళ్లకు పిలవడం తగదు టీచర్లను బలవంతంగా స్కూళ్లకు రప్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఏపీటీఫ్ సమావేశం అభిప్రాయపడింది . టీచర్లు కోవిడ్ 19 బారిన పడుతున్నారని పేర్కొంది . ఒక వైపు టీచర్లను నేరుగా బదిలీ చేస్తూ బదిలీషెడ్యూలును ఒక పద్ధతి ప్రకారం జాప్యం చేయడాన్ని సమావేశం ఖండించింది . బదిలీల షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది . పీఆర్ సీ నివేదిక తక్షణమే వచ్చేలా చూడాలని , కరవు భత్యాలు ఇవ్వాలని కోరింది . కరోనా వల్ల ఆపిన పెండింగు జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది . నాడు నేడు రెండో విడత నిధులు విడుదల చేయకపోవడం వల్ల చాలా చోట్ల పనులు ఆగిపోయాయని సమావేశం అభిప్రాయపడింది .