రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా ( కేజీబీవీ ) ల్లో 2020-21 విద్యాసంవత్సరాని కిగానూ 6 వ తరగతిలో ప్రవేశం కోసం , 7 , 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం మూడో విడత జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు . ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 5 వ తేదీలోపు వారి ఫోన్లకు పంపిన సమాచారం ప్రకారం తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబం ధిత కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్టు చేయాలని వివరించారు . ఏవైనా సమస్యలు , సందేహాలు ఉంటే 9441270099 , 9494383617 నంబర్లను సంప్రదించాలన్నారు