ఏపిటిఎఫ్ 1938 గుంటూరు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గోరంట్ల బ్రహ్మానంద రాజు గారు ఈరోజు పరమపదించారు.వీరి ధర్మపత్ని కీర్తిశేషులు దుర్గా రాణి గారు ఇటీవల వారం రోజుల క్రితం చనిపోయారు. వీరిరువురు ఏపిటిఎఫ్ 1938 నందు గత 30 సంవత్సరాల నుండి క్రియాశీలకంగా పని చేయుచున్నారు. వీరిద్దరూ నాడు-నేడు ప్రాథమిక పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేయుచున్నారు. బ్రహ్మానంద రాజు గారు నరసరావుపేట లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజుల నుండి కోవిద్ చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణం ఏపిటిఎఫ్-1938 వినుకొండ డివిజన్ మరియు గుంటూరు జిల్లా శాఖకు తీరని నష్టం. వారి కుటుంబ సభ్యులకు ఏపిటిఎఫ్ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాము. వారి కుటుంబానికి ఫెడరేషన్ ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేయు చున్నాము.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: జి. హృదయ రాజు & కె.వెంకటేశ్వర రావు, APTF