✍️పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ముఖ్య సూచనలు: -
👉1. పదవ తరగతికి సంబంధించిన వార్షిక పరీక్షల షెడ్యూలు ఒక వారం లోపు రావడం జరుగుతుంది.
👉2. పరీక్షలకు సంబంధించి సిలబస్ విషయం మరియు పరీక్షలకు ఎన్ని పేపర్స్ ఉంటాయనే విషయం కూడా ఒక వారం లోపుగా తెలియజేయడం జరుగుతుంది
👉3. ఈ లోపుగా ఈ సంవత్సరం నూతనంగా ప్రైవేటు పాఠశాలలు స్థాపించిన వారు మరియు ఇప్పటికే నిర్వహిస్తున్న ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్ పాఠశాల వారు పాఠశాలల గుర్తింపు మరియు గుర్తింపు పునరుద్ధరణ అనుమతి మంజూరు ఉత్తర్వులను మరియు అదనపు సెక్షన్లకు అనుమతి మంజూరు ఉత్తర్వులను సంబంధిత అధికారుల నుండి పొంది, కాపీలను DGE గారి ఆఫీస్ కు మెయిల్ చేయాలి.
👉4. పాఠశాల గుర్తింపు అనుమతి మంజూరు ఉత్తర్వులు లేని మరియు అదనపు సెక్షన్లకు అనుమతి ఉత్తర్వులు పొందని పాఠశాలలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆన్లైన్ NR ఓపెన్ కాదు.
👉5. ఈ మాసాంతం లోపు అనుమతి పొంది, సంబంధిత కాపీలను DGE గారి ఆఫీస్ కు పంపినట్లయితే ఈ పాఠశాలల విద్యార్థుల వివరాలు ఆన్లైన్ NR నందు ఉంచ బడవు.
👉6. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకు విడివిడిగా గుర్తింపు అనుమతి మంజూరు ఉత్తర్వులను తీసుకోవాలి.
👉7. గతంలో తెలుగు మీడియం అనుమతి పొంది ప్రస్తుతం అదే పాఠశాల వారు వేరే మీడియం విద్యార్థులను ఫార్వర్డ్ చేయాలంటే మీడియం మార్పుకు కూడా అనుమతి ఉత్తర్వులను పొందాలి.
👉8. అన్ని యాజమాన్యాల లోని పాఠశాల వారు వెంటనే పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, మీడియం, జెండర్, కులం వివరాలు పై తల్లిదండ్రుల ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి.
👉9. ఫోటోలు, పుట్టుమచ్చలు, PH ఒరిజినల్ సర్టిఫికెట్స్ సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలి.
👉10. తల్లులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి ఇంటి పేరు నమోదు సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నమోదు చేయాలి.
👉11. ఈ సంవత్సరం మాన్యువల్ నామినల్ రోల్ కూడా మరలా సిద్ధం చేయవలసి ఉంటుంది.
👉12. నామినల్ రోల్ తయారు చేసే సందర్భంలో లాంగ్వేజ్ కాంబినేషన్ ఖచ్చితంగా పాటించాలి.
👉13. మాన్యువల్ నామినల్ రోల్ నందు, చైల్డ్ ఇన్ఫో నందు, పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్ నందు విద్యార్థుల వివరాలు ఒకే విధంగా ఉండాలి.
👉14.చాలా పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం అడ్మిషన్ రిజిస్టర్ నందు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
👉15.పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్ అనేది ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్రమైనది. దానిలో ఎలాంటి కొట్టివేతలు, దిద్దులు ఉండరాదు.
👉16.. అడ్మిషన్ రిజిస్టర్ నందు ఏవైనా ముఖ్య సవరణలు అవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితోనే (DEO/RJD) చేయాలి.
👉17. పదవ తరగతి పరీక్ష సందర్భంలో పుట్టిన తేదీ కి సంబంధించి అండర్ ఏజ్ అనుమతి పొంది, పరీక్ష పాసై, తర్వాత కాలంలో మరల పుట్టిన తేదీ మార్చమని కోరుతున్నారు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మార్చ బడవు. కనుక వాటి విషయంలో జాగ్రత్త వహించాలి.
👉18. నామినల్ రోల్ నందు తప్పుల మూలంగా ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ లో ఏవైనా తప్పులు దొర్లినట్లు అయితే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను బాధ్యులుగా చేసి వారిపై పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది.
👉19. ఇప్పటికే జారీచేసిన ఎస్ ఎస్ సి సర్టిఫికెట్స్ నందు ఏవైనా చిన్న తప్పులు దొర్లినట్లు వినతులు వస్తే, తగిన ఆధారాలతో నేరుగా DGE గారి ఆఫీసుకు రిజిస్టర్ పోస్ట్ చేయాలి. అంతేగాని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కార్యాలయానికి పంపరాదు.
👉20. ఈ విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి Short Memos జారీచేసే సమయంలోనే, వేరే రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల కొరకు మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరుగుతుంది.