గుంటూరు కృష్ణనగర్ లోని ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయంలో ఈ నెల 15న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ప్రాంతీయ భవిష్య నిధి కమి షనర్ కుందన్ అలోక్ శుక్రవారం తెలిపారు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల పరిధిలోని భవిష్య నిధి పెన్షనర్లందరూ తమకు సంబంధించిన సమస్యలు, ఇబ్బం దులను so.funt ur@epfindia.gov.in మెయిల్, పోస్టు ద్వారా, నేరుగానూ ఈ నెల 15లోపు పంపాలని సూచించారు. సోమవా రం ఉదయం 11:30 నుంచి జరిగే అదాలత్ లో పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై సహాయ పెన్షన్స్ కమిషనర్ చర్చిస్తారని తెలిపారు.