APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF VOICE » భాష్య0కరులున్నారు.... జర భద్రం...:: మోహన్ దాస్ నీరుకట్టు,

భాష్య0కరులున్నారు.... జర భద్రం...:: మోహన్ దాస్ నీరుకట్టు,

Posted by Mohan
» APTF VOICE
» Monday, 19 April 2021

 భాష్య0కరులున్నారు.... జర భద్రం...

(మోహన్ దాస్ నీరుకట్టు, ఏపీటీఎఫ్ 1938)


ఉద్యమాలు చేయకూడదు, స్వాతంత్ర్య నినాదం చేయకూడదు, హక్కుల కోసం పోరాడకూడదు...


సరిగ్గా వందేళ్ళ కిందట బ్రిటీష్ పాలకులు ఇలా అని ఉంటే .... చట్టాల చట్రంలో ప్రజలను బిగించివుంటే.... భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చు0డేది కాదు.  భారతీయులు స్వేచ్చా వాయువులు పీల్చగలిగేవారు కారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెప లాడేది కాదు. ఇక నిజాం పరిపాలనా కాలంలో కూడా ఇంతటి తీవ్రమైన చట్టాలను చూసి ఉండలేదు.


పోరాటం మా జన్మహక్కు అపుడెపుడో కాదు...  ఇప్పుడు కూడా చెబుతున్నాం... రేపు చెబుతాం....



ఇవే మాకు మా భాష్య0కరులు (ఉద్యమ నేతలు) నేర్పిన పాఠాలు.


ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఈరోజు (19.04.2021) ఒక సర్క్యులర్ విడుదలైంది.  దాని సారాంశం ఒకసారి పరిశీలించాలి ప్రతి ఒక్కరు...!


ప్రభుత్వంలోని ఉద్యోగుల విధులను నిర్వర్తించడంలో మరియు ప్రజలతో వారి ప్రవర్తనపై ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటుందని డిపార్ట్‌మెంట్‌లోని అన్ని అధికారులు / ఉద్యోగులు / ఉపాధ్యాయులు మరియు సంఘాలు తెలుసుకోవచ్చు.  క్రమశిక్షణ అనేది ఏదైనా క్రమబద్ధమైన రాష్ట్రానికి లేదా సమాజానికి పునాది మరియు ప్రభుత్వ సేవకుడి నుండి ఏదైనా దుష్ప్రవర్తనకు గురయ్యే ప్రజలే.


 ప్రభుత్వ ఉద్యోగి యొక్క దుష్ప్రవర్తన ప్రభుత్వంపై ప్రతిబింబిస్తుంది మరియు అందువల్ల, ప్రభుత్వ ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది.  అంతేకాకుండా, సేవా సంఘాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉంటాయి మరియు ప్రతి ప్రభుత్వ సేవకుడు ఎటువంటి విచలనం లేకుండా కట్టుబడి ఉండాల్సిన AP సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా) నిబంధనలు, 1964 కు కట్టుబడి ఉంటాయి.


 సేవా సంఘాలను గుర్తించడం మరియు ఉపసంహరించుకోవడం, సడలింపు, వ్యాఖ్యానం, పెనారిటీలు మరియు సేవా సంఘం యొక్క పరిశీలన కాలం AP సివిల్ సర్వీసెస్ (రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్) నిబంధనలు, 2001 vide GOMs.No.264, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (  సేవా సంక్షేమం) విభాగం, తేదీ: 22.06.2001.


 AP ప్రవర్తనా నియమాలు, 1964 యొక్క నియమం (4) ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి సమ్మె లేదా ఇలాంటి కార్యకలాపాలలో లేదా ప్రేరేపణలలో పాల్గొనకూడదు మరియు AP ప్రవర్తనా నియమాల నియమం 24 (1) ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తీసుకురాకూడదు, లేదా  తన ప్రయోజనాల కోసం ఏదైనా అధికారాన్ని భరించడానికి ఏదైనా అదనపు ప్రభావాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.  ఫైల్ నెం. ESEO2-30 / 7/2021-పెషి-సిఎస్ఇ


 GOMs.No.177, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SW.I) డిపార్ట్మెంట్, Dt: -13-04- 2011 ప్రకారం, ఆందోళనలో పాల్గొనే ఉద్యోగులపై తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  "సమ్మెలు, బంద్స్, పెన్ డౌన్, చాక్ డౌన్ మొదలైనవి" వంటి కార్యక్రమాలు మరియు కార్యాలయాల ప్రాంగణంలో కలతపెట్టే కార్యకలాపాల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించబడతాయని తెలియజేసింది, ఇది మర్యాద మరియు ఆకృతిని ప్రభావితం చేస్తుంది.  ప్రభుత్వం మరియు "నో వర్క్ - నో పే" విధానాన్ని ఖచ్చితంగా అవలంబించండి. మరియు కాలాన్ని "నాట్ డ్యూటీ" గా పరిగణించండి. ఆ కాలానికి ఎటువంటి వేతనము మరియు అలవెన్సులు అనుమతించబడవు.


 ఇటీవలి కాలంలో, ప్రవర్తనా నియమాలను వివిధ కార్యకర్తలు మరియు సేవా సంఘాల ప్రభుత్వ ఉద్యోగులు కొందరు సరిగా పాటించడం లేదని సంతకం చేసిన వారి దృష్టికి అనేక సంఘటనలు వచ్చాయి.  ప్రారంభ దశలోనే అదే తగ్గించాలి.


 పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నియంత్రణలో పనిచేస్తున్న అన్ని అధికారులు / ఉద్యోగులు / ఉపాధ్యాయులు మరియు సేవా సంఘం AP సివిల్ సర్వీసెస్ (రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్) నిబంధనలు, 2001 మరియు AP సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన)  1964 నియమాలు సరిగా ఉన్నాయి.  ప్రవర్తన నియమాలను సరిగ్గా పాటించడంలో విఫలమైతే AP CCA నియమాలను అమలు చేయడానికి పరిమితం చేయబడింది


 పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులు ఈ సూచనలు అధికారులు / ఉద్యోగులు / ఉపాధ్యాయులు మరియు అన్ని సేవా సంఘాలకు వ్యాపించేలా చూడాలని మరియు నిబంధనలను కార్యాలయ నోటీసు బోర్డులో మరియు నోటీసు బోర్డులలో ఉంచాలని అభ్యర్థించారు.  ప్రతి పాఠశాల విస్తృత వ్యాప్తి కోసం మరియు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పుస్తకం ద్వారా పాటించేలా చూసుకోండి.


ఈ ఉత్తర్వుల సారాంశం ఉపాధ్యాయుల పోరాట శక్తికి సంకెళ్లు వేయడమే. అటక మీద విన్న పాత చట్టాలకున్న బూజు దులిపి పదును పెట్టడమే.


*ఇకపై ప్రభుత్వాన్ని గానీ అధికారులను కానీ ఏ విధంగానూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం ఇకపై నిబంధనలకు వ్యతిరేకం.  అభిప్రాయ/ భావ వ్యక్తీకరణ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుంది. 


దేశంలోని పలు రాష్టాల్లో ప్రభుత్వాలు ఇలాంటి చీకటి చట్టాలను తెచ్చాయి. సమ్మెలు నిషేదించాయి. తమిళనాడు ప్రభుత్వం సమ్మె చేసిన అనేకులను ఉద్యోగం నుంచి పీకేసింది. వారంతా సుప్రీంకోర్టుకు వెళ్లి ఊరట పొందారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీ సమ్మె విషయంలో ఉక్కుపాదం మోపి వారిని దారికి తెచ్చువడం సుపరిచితమే!  అదే ఫలితాలను స్ఫూర్తిగా తీసుకున్న ఎపి ప్రభుత్వం తొలి దెబ్బ విద్యారంగం కొరడా ఝళిపించింది. ఇక్కడి ఎమ్మెల్సీలు ఇతర యూనియన్లు ఏమీ మాట్లాడలేని స్థితి.

పదోన్నతుల గురించి అడగకూడదు, 

బదిలీల్లో పారదర్శకతను గూర్చి అడగకూడదు, 

డి.ఏ గురించి, పిఆర్సీ అమలు గురించి, 

పాఠశాలల బాగు గురించి, విద్యార్థుల - ఉపాధ్యాయుల ఆరోగ్యానికి ప్రస్తావించకూడదు. ఉపాధ్యాయుల సమస్యల గురించి అసలు మాట్లాడకూడదు. 


ఈ వైఖరి దేనికి సంకేతం? నిరంకుశ వైఖరికి దారులు తెస్తున్నట్లుగా లేదా?


స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధ్యాయులపై ఇలాంటి చట్టాలు అపుడపుడూ పిల్లిమొగ్గలు తొడుగుతూనే ఉన్నాయి.  కాకపోతే ఇపుడు పాత చట్టాలకు కొద్దిగా పదును పెడుతూ  ఒక సర్క్యులర్ వదిలారు. యూనియన్ల ఉనికిని,  మూలలను పెకిలించి విఫలయత్నం చేసారు..  ఫరిధులను  ప్రశ్నించే కుటీల యత్నం చేసికంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సంఘాలకు ఉపాధ్యాయుల్లో ఒక అడ్డుగోడను పాతే వ్యవహారమది. సంఘాలపైనా, ఉపాధ్యాయవర్గంపైనా సంబంధిత అధికారి ఒంటి కాలి  మీద లేవడానికి కారణమేమై ఉండొచ్చు? కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బదిలీల కోసం వత్తిడి తేవడం, ఆ ప్రక్రియను నిర్ణీత నిర్వహించడంలో అధికారులు విఫలం కావడం ఆ సందర్భంగా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.సంబంధిత అధికారి ఎదురుగానే ఆయన కార్యశీలతపై సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి సంఘాలు వర్సెస్ అధికారి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.లోలోపల ఆగ్రహంతో మరిగిపోతున్న అధికారి నెల మీద పాదం మోపలేకపోయారు. సంఘాల ఉనికిపై ఎదురుదాడికి దిగారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులపై ఉక్కు పాదం మోపారు. ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉసిగొల్పాడానికి ప్రతి సందర్భాన్ని వినియోగించుకున్నారు. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో మీకు గుర్తింపు ఎలా ఉంటుందో, మీకు ఏ జీ.ఓ ప్రకారం ఫెడరేషన్ గుర్తింపు లభించిందో పాత జీ.ఓ ల బూజు దులపడం మొదలుపెట్టారు. సమావేశానికి పిలిచి నాయకులపై చిర్రుబుర్రులాడారు. దీంతో సంఘాలు అర్ధంతరంగా ముగియడం విదితమే! తదనంతరం సంఘాలను, ఉపాధ్యాయులను సవాలు చేసే రీతిలో సర్క్యులర్ ఇవ్వడం తెలిసిందే!

*ఆట ఆయన ప్రాభించారు... మనం ఆడాల్సిందే, క్షేత్రస్థాయిలో  సమీకరణ జరపాల్సిందే, ఉత్తమ ముగింపు పలకాల్సిందే ! పాఠాలు చెప్పాల్సిందే, గుణపాఠం నేర్పాల్సిందే!  ఉపాధ్యాయ హక్కుల ధ్వంసంపై అన్ని వేదికలపై పోరాట రూపంలోనే సమాదనమిస్తాం తప్ప పాదుకలు మోయడం,  పాదాక్రాంతమవడం వంటి ప్రశ్నే లేదు

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |