మిత్రులారా!
22 మార్చి 2021,
ఈరోజు సాయంత్రం మంగళగిరి నందలి ఏపీఐఐసీ కార్యాలయం నందు రాష్ట్ర ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.
1. ఇటీవల కోవిడ్ వ్యాధితో మరణించిన ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ట్రస్టు తరఫున తెలపడం జరిగింది తదుపరి ఈ క్రింది నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.
2. జూలై 1 నుండి 15 నుంచి జిల్లా కేంద్రాలలో గల అన్ని టీచింగ్ హాస్పిటల్స్ నందు ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
3. క్రానిక్ ఓ పి లకు మందులు కూడా ఇస్తారు
3.605 రకాల ప్రొసీజర్స్ కొత్తగా చేర్చడం జరిగింది.
4. మెడికల్ క్లైములనుఒక్క నెలలో పరిష్కరించగలరు.
5. జూలై 19 వ తేదీన నెట్వర్క్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించెదరు.
6. ఎయిడెడ్ మరియు మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరుపై ప్రతిపాదనలు పంపి యున్నారు.
ఇకపై ఫోన్ ద్వారా మెడికల్ స్టేటస్ తెలుసుకొనుటకు మరో ఉద్యోగిని నియమిస్తారు.