కస్తూర్భా బాలికా విద్యాల యాల్లో కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీ) పోస్టుల భర్తీకి టెట్ అర్హతను తొలగిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశాలిచ్చింది. టెట్ అర్హత లేకుండా కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని సూచించింది. పీఈ టీలకు టెట్ అర్హత నిబంధన పెట్టడంపై అభ్యర్ధుల నుంచి వినతులు రావడంతో పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.