APTF GNT :C. P. S ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఎ.పి.టి.ఎఫ్ ( 1938)ధర్నా
గుంటూరు:- ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎ.పి.టి.ఎఫ్ ( 1938) గుంటూరు జిల్లా శాఖ ఆద్వర్యంలో ధర్నా :
ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయం నగరం పాలెం నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయంకు,అక్కడ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సి.పి.యస్ రద్దు చేసి పాత పెంక్షన్ కొనగించాలనీ,ఉన్నత పాఠశాల లో 3,4,5 తరగతులను విలీనం విరమించుకోవాలని పాఠశాల లలో ఆంగ్ల మీడియం తో పాటు తెలుగు మీడియం ను కూడ కొనసాగించాలనీ, ఉపాద్యాయులుకు ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తం బకాయులను వెంటనే చెల్లించాలని, 2018 జులై తరువాత పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాద్యాయులులకు గ్రాట్యుటి పెంపుదల వర్తింపు చేయాలనీ, డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు ధర్నా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం రాష్ర ఉపాధ్యక్షుడు జె.విజయానంద్,జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శి లు జి.వి.రాజు,కె. నరసింహారావు, గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి ఏ .జోజప్ప జిల్లా నాయువకులు, సాయన్న మేకల సుబ్బారావు యం.వి.ప్రసాద్, పి.రమేష్,శివశంకర్,ఓ. నాగార్జున, గణేష్, నాగమల్లేశ్వరరావు, వేణుగోపాలరావు,GSS ప్రసాదు, PDSU రాష్ట్ర అధ్యక్షుడు గనీరాజు,మహిళానాయుకులు పవిత్ర, ఉదయశ్రీ , ఎలిజబెత్ నాగమణి, ,పద్మావతి, ఆలియా, కావటిశంకర్ రావు మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు జిల్లా లోని వివిద ప్రాంతాల ఎ.పి.టి.ఎఫ్ నాయుకులు కార్యకర్తలు పాల్గాన్నారు.


