*రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరికీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసు (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్అప్పీల్) రూల్స్ 1991 వర్తిస్తాయి. ప్రోవి్ిటలైజెషన్ చేయబడినందున పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.*
*ఎ) స్వల్ప దండనలు: 1) అభిశంసన,*
*2) పదోన్నతి నిలుపుదల,*
*3) ప్రభుత్వమునకు కలిగిన ఆర్థిక నష్టమును రాబట్టుట ఇంక్రిమెంట్లు నిలుపుదల,*
*5) సస్పెన్షన్*
*బి) తీవ్ర దండనలు:*
*1) సీనియారిటీ ర్యాంకును తగ్గించుట లేక క్రింది పోస్టునకు / స్కేల్ కు తగ్గించుట,*
*2) నిర్బంధ పదవీ విరమణ,*
*3) సర్వీసు నుండి తొలగించుట (Removal)*
*4) బర్తరఫ్ (Dismissal)*
*(సర్వీసు నుండి తొలగించబడిన ఉద్యోగి భవిష్యత్తులో తిరిగి నియామకం పొందుటకు అర్హుడు. కాని డిస్మిసల్ గురైన ఉద్యోగి భవిష్యత్ నియామకమునకు అర్హత ఉండదు*)
*సస్పెన్షన్ : తీవ్ర అభియోగములపై విచారణ జరుగుచున్నప్పుడు లేక క్రిమినల్ అభియోగంపై దర్యాప్తులో వున్నప్పుడు లేక కోర్టు విచారణ జరుగుచున్నప్పుడు మాత్రమే ప్రజాహితం దృష్ట్యా ఒక ఉద్యోగిని సప్సెన్షన్లో వుంచవచ్చును. సప్పెషన్షన్ ఉత్తర్వు ఉద్యోగికి అందజేయబడిన తేదీ నుండి మాత్రమే అమలులోకి వచ్చును.*
*ఉద్యోగికి 48 గంటలకు మించిన జైలు శిక్ష విధించబడినప్పుడు లేక డిటెన్షన్ క్రింది 48 గంటలు కస్టడీలో వుంచబడినప్పుడు అట్టి తేదీ నుండి సప్పెన్షన్లో వుంచబడినట్లు పరిగణిస్తారు.*
*సస్పెన్షన్ కాలంలో FR-53 ననుసరించి అర్ధజీతపు సెలవు కాలవు జీతమునకు సమానంగా సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తారు. 6 నెలల తరువాత దానిని 50% పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయవచ్చు. నియామక ఆధికారికి పైఅధికారి తన సమీక్షానంతరం దానిని కొనసాగించవచ్చును. విచారణలోనుండగా సప్పెన్షన్ శిక్ష చర్య కాదు. పాక్షిక నిర్దోషి అని తేలితే సబ్సిస్టెన్స్ ఆలవెన్స్ ని తగ్గకుండా జీతం నిర్ణయం చేయవచ్చు.*
*అప్పీలు (Appeal) : సప్పెన్షన్ వుంచబడినప్పుడు లేక విధించబడిన శిక్ష అన్యాయమైనదిగా భావించినప్పుడు ఆ నిబంధన యొక్క అనుబంధంలో చూపబడిన సంబంధిత ఆప్పిలేట్ అధికారికి మూడు నెలల గడువులోగా అప్పీల్ చేసుకొనవచ్చు. చివరిగా ప్రభుత్వమునకు అప్పీలు చేసుకొనవచ్చును.*