క్యాష్ రికవరీ చల్లాన్ ప్రిపేర్ చేయు విధానం:
ఏ ఎంప్లాయ్ కి అయిన రావాల్సిన జీతం కంటే ఎక్కువ జీతం పొందినప్పుడు క్యాష్ రికవరీ చల్లాన్ ద్వారా తిరిగి గవర్నమెంట్ కి చెల్లించవలెను.
చల్లాన్ జెనరేట్ చేయు విధానం
1. సి.యఫ్.యమ్. యస్ లో సిటిజెన్ సర్వీసెస్ లో క్యాష్ రికవరీ చల్లాన్ మీద క్లిక్ చేసి వారు ఏ నెల అయితే ఎక్కువ జీతం డ్రా చేసారో ఆ నెల బిల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను. (బిల్ నెంబర్ తెలియకపోతే డి.డి.ఓ గారు ని అడిగితే చెప్తారు)
2. సబ్మిట్ చేసిన తరువాత బెనెఫిషరీ కోడ్ దగ్గర ఆ ఎంప్లాయ్ యొక్క సి.యఫ్.యమ్. యస్ ఐ. డి ఎంటర్ చేయవలెను
3. రేమిటర్ పేరు , వారి ఫోన్ నెంబర్ , ఆధార్ లేదా పాన్ దగ్గర వారి సి.యఫ్.యం. యస్ లేదా హెచ్.ఆర్.యం. యస్ ఐ. డి వేసి దేని వల్ల అమౌంట్ బ్యాక్ చేస్తున్నారో కారణం రాయవలెను.
4. సర్వీస్ టైప్ దగ్గర క్యాష్ రికవరీ ఎగైన్స్ట్ ది బిల్ సెలెక్ట్ చేయవలెను (టైప్ 213)
నోట్ : చల్లాన్ జెనరేట్ చేసే సైట్ సి.యఫ్.యం. యస్ ఓపెన్ పోర్టల్ గమనించగలరు.
#CFMS