గుంటూరు:- ఉమ్మడి గుంటూరు జిల్లా పరిదిలోని ఉపాద్యాయుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో గత రెండు సంవత్సరాల నుండి నమోదు కాకుండ పెండింగ్‌లో నున్న వాటిని వెంటనే నమోదు చేయాలనీ ఎపిటిఎఫ్ గుంటూరు జిల్లా శాఖ,జిల్లా ముఖ్య కార్యనిర్వాహనాదికారి శ్రీ శ్రీ నివాసరెడ్డి గారిని కోరడమైనదనీ,జి ల్లా ప్రధాన కార్యదర్శి మేకల సుబ్బారావు తెలిపారు.
అదే విదంగా ఇటివల బదలి అయిన ఉపాద్యాయులకు వారి ఖాతాలకు వెంటనే. జమచేయాలనీ ,మార్చి ,2022 నుండి ఉపాద్యాయుల జీతాల నుండి మినహాయింపు చేసిన సోమ్ములను వారి ఖాతాలో జమచేయాలనీ కోరగా,శ్రీ యుత ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు సానుకూలంగా స్పందించి,సంబందిత అదికారులను పిలిపించి,మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తామనీ హామీ ఇచ్చారు.
అదే విధంగా జిల్లాపరిషత్ వెబ్‌సైట్ ను ఆఫ్ డేట్ చేస్తున్నామనీ,త్వరలో అన్ లైన్ లో ఉపాద్యాయులు పరిశీలించుకునే విధంగా ఆఫ్ డెట్ చేయబడుతుందనీ తెలియ చేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రదాన కార్యదర్శి మేకల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కట్టెబోయిన నరసింహారావు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ విజయానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ పి.రమేష్, సీనియర్ నాయుకులు శ్రీ యం.భాను, శ్రీ దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మేకల సుబ్బారావు ప్రదాన కార్యదర్శి ఎపిటిఎఫ్ (1938)