అన్ని పాఠశాలల యాజమాన్యాలు 2020-23 విద్యాసంవత్సరం టెన్త్ విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి/ఏప్రిల్ - 2023లో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తుల నమోదు, ఫీజు చెల్లింపు ప్రక్రియకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు, ఆయా పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధానాలను www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల సూచనలు, యూజర్ మాన్యువల్ పేరుతో పొందుపరిచినట్లు వివరించారు. విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు అందులో పేర్కొన్న అన్ని విషయాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.