APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » All Posts
Resultant Vacancies అంటే?

Resultant Vacancies అంటే?

Mohan
APTF Updated at: June 05, 2023

 Web options info#


Resultant Vacancies అంటే కంపల్సరీ కాకుండా ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకున్న వాళ్ళ ప్లేస్ లు

TEACHERS TRANSFERS 2023 SCHEDULE

TEACHERS TRANSFERS 2023 SCHEDULE

Mohan
APTF Updated at: June 05, 2023

 ■ మే30న అభ్యంతరాల స్వీకరణ..


■ మే 31, జూన్ 1న అభ్యంతరాల పరిష్కారం..

■ జూన్ 2, 3 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాలు..

■ జూన్ 4న ఉపాధ్యాయ ఖాళీల ప్రదర్శన..

■ జూన్ 5, 6 తేదీల్లో ప్రధానోపాధ్యాయులకు వెబ్ ఆప్షన్స్

■ జూన్ 5 నుంచి 7వరకు స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ ఆప్షన్స్.

■ జూన్ 5 నుంచి 8వరకు ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లకు అవకాశం..

■ జూన్ 9న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల జాబితాలు..

■ జూన్ 9 నుంచి 11వరకు ఎస్జీటీల జాబితాల జనరేషన్ ప్రక్రియ..

వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఉపాధ్యాయులకు గమనిక

వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఉపాధ్యాయులకు గమనిక

Mohan
APTF Updated at: June 04, 2023

 మీరు అనుకున్న వెబ్ ఆప్షన్స్ ముందుగానే ఒక క్రమంలో పేపర్ పై  రాసుకొని కంప్యూటర్ ముందు కూర్చుని వెబ్ ఆప్షన్స్ నమోదు చేయండి..

 

దానివలన మీరు అనుకున్న ఏ స్థానం మిస్ కాదు. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. వర్కు త్వరగా పూర్తవుతుంది..


వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఇతరులకు ఫోన్ చేసి స్థానాల గురించి విచారణ చేయవద్దు. అది మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజన్ లోకి  నెడుతుంది..


నీ వెనక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వచ్చినవారికి కూడా అవకాశం కల్పించాలి..


ఫోన్లో కన్నా కంప్యూటర్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం సులువు.


పదేపదే ఫోన్లో వెబ్ ఆప్షన్స్ లింకును ఓపెన్ చేయకండి. దానివలన సర్వర్ పై ఒత్తిడి పెరిగి వెబ్సైట్ ఇంకా స్లో అవుతుంది.


మీరు ఎంచుకునే పాఠశాలలో ఎటువంటి వేకెన్సీ అయినా ఒకటే.. అనగా క్లియర్, లాంగ్ స్టాండింగ్, రిపోర్ట్స్నైట్ అని తేడా ఉండదు.. ఒకసారి ఆ పాఠశాలలో చేరితే అందరూ సమానమే.. కావున వేకెన్సీ రకాలు గురించి కంగారు పడకండి..


ప్రిఫరెన్షియల్ వారు సాధ్యమైనంత వరకు 1,2 కేటగిరీలు కోరుకోవటం మంచిది..(ఇది కేవలం  సలహా మాత్రమే)... లాంగ్ స్టాండింగ్ తరువాత మరలా మీరు ఏటూ ఆ కాటగిరిని వాడుకోవచ్చు..


తప్పనిసరి బదిలీ వారు జిల్లా లోని అన్ని స్థానాలను పెట్టుకోవాలి..

రిక్వెస్ట్ బదిలీ వారు తమ స్థానాన్ని తప్పనిసరిగా చివరకు పెట్టుకోవాలి..This is most important.


ఒకే పంచాయతీలో మరొక పాఠశాలను కూడా మనం కోరుకోవచ్చు..


SPOUSE వారు తప్పనిసరిగా మీ ప్రియారిటిలో  మీ SPOUSE పని చేస్తున్న మండలాలనే ముందుగా పెట్టండి.. తర్వాత మిగిలినవి పెట్టండి.. లేకపోతే బదిలీల అనంతరమైన చర్యలు ఉంటాయని GO లో స్పష్టంగా పేర్కొన్నారు..


వెబ్ ఆప్షన్స్ పూర్తి అయిన తదుపరి మీరు పెట్టిన ఆప్షన్స్ తప్పనిసరిగా ప్రింట్ తీయించుకోండి.. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తే మరలా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడం మరింత సులువు...ప్రింటింగ్ ఖర్చుకు వెనుకాడవద్దు..


మీకు ఏ స్థానం కేటాయించబడినా మీరు సమర్థవంతంగా పనిచేస్తారు కాబట్టి... అంతా పాజిటివ్ గా ఉండండి...మీరు కోరుకున్న ప్లేస్ తప్పనిసరిగా వస్తుంది..



All the best..

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

Mohan
APTF Updated at: March 07, 2023

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జ:- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.
( *G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980 ) *రూల్ : 42,43

పెన్షన్ కమ్యూటేషన్:
                    
స్వచ్చంద ఉద్యోగ విరమణ పొందిన  ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును. దీనినే పెన్షన్ కమ్యూటేషన్ అంటారు.
( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999)
గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది

#పెన్షన్

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.
పెన్షన్ లెక్కించు విధానము:-
చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు
20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

 కుటుంబ పెన్షన్ వివరాలు
 
రిటైర్మెంట్ గ్రాట్యుటీ

కనీస అర్హత గల సర్వీస్: 
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

                డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు) 
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ ) 
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38 
/4 (చెల్లించాల్సిన రోజు) 
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది. 

             పెన్షన్ రకాలు

1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

    మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు. 

2.  కుటుంబ పెన్షన్: -
  మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30% 

3.  అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

        FAMILY PENSION

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

 EXample 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్  
7740×30/100 =2322.00
దీనిని భార్యకు జీవితాంతం చెల్లిస్తారు..

 Example 2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ 11530×30/100 = 3459.00

CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం) 

రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు 
1.స్వచ్ఛంద పదవి విరమణ.
2.పదవీ విరమణ
3.ఆకాలమరణం 

ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.

1. స్వచ్ఛంద పదవీవిరమణ ::---
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.

సూచన :--మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.A.S 

2. సాధారణ పదవీ విరమణ
ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.

సూచన
  మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

3. ఆకాలమరణం పొందిన సందర్భంలో
ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ  కి చెల్లిస్తారు.

దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasury)కి పంపవలేను..

ఉద్యోగుల సేవా నిబంధనలు

ఉద్యోగుల సేవా నిబంధనలు

Mohan
APTF Updated at: February 23, 2023

ZP/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్

చందాదారుడు 20 సం॥ సర్వీసు పూర్తిచేసినా, లేక పదవీ విరమణ చేయడానికి 10 సం॥ మిగిలివున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి మంజూరుచేస్తారు.  రూల్ -15A

గృహసంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సం॥ సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకోవడానికి అర్హత కలదు.

పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించబడదు కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చును.

(G.O.Ms.No.98 తేది:19-06-1992)

సాధారణంగా 6 నెలల తరువాతనే రెండవ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించాలి లేక ఒక ఆర్ధిక సం॥లో రెండు కంటే ఎక్కువ పార్ట్ ఫైనల్ డ్రాయల్ మంజూరు చేయరాదు. రూల్-15B

 ZP/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకుంటే ఎటువంటి రికవరీ ఉండదు.

ZP/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ దరఖాస్తును 'అపెండిక్స్-O' లో సమర్పించాలి.

ఉద్యోగి పదవీ విరమణ చేసినా,లేక ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక మరణించినా అతని ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం అతనికి,అలాగే ఉద్యోగి చనిపోతే అతడు సమర్పించిన నామినేషన్ ప్రకారం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. నామినేషన్ లేని సందర్భాలలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ సమాన వాటాల ద్వారా చెల్లిస్తారు. రూల్- 28, 29, 30

GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్,ఫైనల్ విత్ డ్రాయల్ బిల్లులను ఫామ్-40 లో దాఖలు చేయాలి. అలాగే ఫామ్-40A కూడా జతపరచాలి.

జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రధానోపాధ్యాయులు, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ మంజూరుచేసి ఫాం-40 తో పాటు జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు సొమ్మును ఉపాధ్యాయులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు.

ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ ద్వారా బాంక్ క్రెడిట్ చేస్తున్నారు.

(G.O.Ms.No.447 Dt:28-03-2011)

ఉపాధ్యాయులు - సెలవులు మంజూరు అధికారాలు

ఉపాధ్యాయులు - సెలవులు మంజూరు అధికారాలు

Mohan
APTF Updated at: February 20, 2023

.Ms.No.58 విద్య తేది:22-04-2008  ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి. కాలక్రమేణా ఆ నియమాలను సవరిస్తూ G.O.Ms.No.70 విద్య తేది:06-07-2009 ద్వారా ఏ స్థాయిలో అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు  చేయవచ్చునో తాజా మార్గదర్శకాలు జారీ చేయబడినవి.

ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:

ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు (CLs, Spl. CLs) ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు  మించకుండా మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:
ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

ప్రసూతి సెలవు(Maternity Leave):

మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు  G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

మండల విద్యాధికారులు:
తన పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ప్రాథమికోన్నత  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

ఉప విద్యాశాఖాధికారి
తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

జిల్లా విద్యాధికారి:
జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/అర్ధవేతన, కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం॥ వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సం॥ వరకు అన్ని రకాల సెలవులు మంజూరు  చేస్తారు.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:
మండల విద్యాధికారులకు/ఉన్నత/ ప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సం॥ నుండి 4 సం॥ వరకు సెలవు మంజూరు చేస్తారు.

 కొన్ని ముఖ్యాంశాలు:
  • సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.
  • సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.
  • నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4వ కేటగిరీకి బదిలీచేస్తారు.
  •  అధికంగా వాడుకున్న సెలవును  FR-18 ప్రకారం  అనధికార గైర్హాజరుగా భావించి డైస్ నాన్ గా ప్రకటిస్తారు.

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

Mohan
APTF Updated at: February 19, 2023

 ఆదాయ పన్ను సమాచారం


పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు




♦️ ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.



♦️ అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది

March-May  15%

Jun-Aug 45%

Sep-Nov  75%

Dec-Feb 100%



అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.



♦️ ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.



♦️ ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.

 


♦️ కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

 

♦️ ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచోఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.



♦️ DDO లకు సూచనలు

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)



♦️ DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.



♦️ లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)



♦️ DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.



♦️ TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.


♦️ లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.



♦️ TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.



♦️ ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.



♦️ పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు...

Newer Posts
Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |