గ్రూపు ఇన్స్యూరెన్స్ స్కీమ్ - సమగ్ర వివరణ
*గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం(GIS)*
*ఇది 1.11.84 లో ప్రవేశ పెట్టబడింది*
*1.11.84
తర్వాత ఉద్యోగం లో చేరిన వారు తదుపరి నవంబర్ నుండి మాత్రమే సభ్యులు
అవుతారు*
*ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో పొందిన
రెగ్యులర్ ప్రమోషన్ లేక నియామకం వల్ల అతని వేతన స్కేల్ గరిష్ట పరిస్థితి మారిననూ
తదుపరి నవంబర్ నుండి మాత్రమే అతని సభ్యత్వం గ్రూపు మారుతుంది*
*ఎయిడెడ్ వారికి జులై నుండి మాత్రమే మారుతుంది*
*ఉద్యోగి చెల్లించే ప్రతి 10రూ లలో 3.125రూ ఇన్సూరెన్స్ ఖాతాకు, 6.875రూ సేవింగ్స్ ఖాతాకు జమ
చేస్తారు*
*ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతని సభ్యత్వ గ్రూప్ ను బట్టి ఎంత రుసుం
చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ మొత్తం తో పాటు సేవింగ్స్
మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారు*
*ఉద్యోగి రిటైర్డ్ ఐనా లేక రాజీనామా చేసినా సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే GPF
కి వర్హించే వడ్డీ రేటుతో కలిపి చెల్లిస్తారు*
*ఎయిడెడ్ టీచర్ల కి LIC వారే నేరుగా ప్రీమియం వసూలు
చేసి, చనిపోయిన వారికీ డబ్బు చెల్లిస్తారు*
*చెల్లింపు విధానం*
*జీఓ.148 తేదీ:6.6.12 ప్రకారం
ఉద్యోగి రిటైర్డ్ ఐనా మరణించినా GIS పథకం కింద అతడు
చెల్లించిన ప్రతి యూనిట్ కి సేవింగ్స్ ఖాతా నుండి 3 పట్టికలలో
చూపిన విధంగా చెల్లించబడును*
*ఈ పట్టికలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం విడుదల చేయును*
*1)
పథకంలో చేరి 31.10.94 నాటికి పూర్తి ఐన
సంవత్సరం లను బట్టి ఆనాటి కి సేవింగ్స్ ఖాతాలో వడ్డీ తో సహా గల నిల్వ మొత్తం ను table-1
నుండి గుర్తించాలి*
*2)
సభ్యత్వం ముగియు నాటికి సదరు నిల్వ మొత్తం పై లభించెడి వడ్డీని table-2
గా గుర్తించాలి*
*3)
1.11.94 నుండి సభ్యత్వం ముగియు నాటికి లభించే వడ్డీ తో కూడిన
సేవింగ్స్ మొత్తం ను table-3 గా గుర్తించాలి*
*ఈ మూడింటిని కలుపగా వచ్చు మొత్తం ఒక యూనిట్ కి చెల్లించబడే మొత్తం
తెలుస్తుంది*
*ప్రతి సంవత్సరం GPF కి చెల్లించే వడ్డీని దీనికి
వర్తింపజేస్తారు*
*GIS
కాంట్రిబ్యూషన్ రేట్లు*
*scale
18030 and above--GroupA --units8--120/-*
*scale
11860--42590-- GroupB- -units4--60/-*
scale--8440--32200-- GroupC- -units2--30/-
scale 6700--23650-- GroupD--units1--15/-*