*ఏపీటీఎఫ్:* కర్నూలు
కర్నూలు జిల్లా నూతన డి.ఈ.ఓ గా నియమితులైన శ్రీమతి తెహరా సుల్తానా గారిని ఈ రోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.
ఈ సంధర్భంగా జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్న SGT, SA's క్రమబద్దీకరణలు చేయాలనీ, ఎయిడెడ్ టీచర్స్ కు 010 హెడ్ పై జీతాల మంజూరుకు HRMS లో వివరాల నమోదుకై తగు చర్యలు తీసుకోవాలని, బదిలీ కాబడి రిలీవ్ కానీ వారిని వెంటనే రిలీవ్ చేయాలని తదితర సమస్యలను DEO గారి దృష్టికి తేవడం జరిగింది.DEO సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు
జి.హృదయరాజు, రాష్ట్ర కార్యదర్శి ఏ.కమలాకరరావు,ఈసీ మెంబర్ రామ్మోహన్, రాష్ట్ర కౌన్సిలర్స్ కె.మద్దిలేటి, రాఘవరెడ్డి, పుల్లారెడ్డి,రామకృష్ణ,శ్రీనివాసులు జిల్లా నాయకులు కె.శేఖర్, VC తిమ్మప్ప, కర్నూలు, ఓర్వకల్, కల్లూరు నాయకులు సూరిబాబు, శేషయ్య, సురేష్,శ్రీనాథ్,శివరాం,విజయభాస్కర్, ప్రభావతి మేడం తదితరులు పాల్గొన్నారు.
- ఏపీటీఎఫ్