ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హథ్రాస్ లో దళిత బాలిక మనీషా వాల్మీకి ని మూకుమ్మడిగా హత్యాచారం చేసిన దుండగులను కఠీనంగ శిక్షించాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయ రాజు డిమాండ్ చేశారు.
APTF ఫెడరేషన్ పిలుపు మేరకు మనీషా పై , దేశం, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం ముందు జిల్లా గౌరవాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏ.కమలాకర రావు అధ్యక్షతన కొవ్వుతులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయ రాజు మాట్లాడుతూ హథ్రాస్ దళిత బాలిక మనీషా పై మూకుమ్మడి అత్యాచారం చేయడం, అర్ధరాత్రి కననం చేయడం, సాక్ష్యాలు కనుమరుగు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరు చూస్తే మహిళల రక్షణ పట్ల పూర్తి నిర్లక్షం వహిస్తుందన్నారు. దేశంలో అనేక మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
APTF మహిళ ప్రతినిధి శ్రీమతి.విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అయా ప్రభుత్వాలు హరించివేయడం, మహిళలపై అత్యాచారాలను చేస్తున్న వారిపై చర్యలు తీసుకో కుండ,మహిళలను స్వేచ్ఛను హరిస్తూ ఇంటికి పరిమితం చేయాలని మాట్లాడడం మహిళల పట్ల వారికున్న గౌరవం అర్థమౌతుందన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. ఇస్మాయిల్ మాట్లాడుతూ సామాజిక భాద్యతగా APTF మహిళలు, బాలికల రక్షణ కోసం మరియు అత్యాచారాలు చేసిన వారిని తీవ్రంగా శిక్షించుటకు ఎంతటి ఆందోళన కార్యక్రమాలనైనా APTF చేస్తుందని అన్నారు. కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో జిల్లా ఉపాధ్యక్షుడు కె.జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్స్ గఫార్, కె.మద్దిలేటి, పుల్లారెడ్డి, శ్రీనివాస రెడ్డి, మండల నాయకులు హాబిబుల్ల, సురేష్, నాగేంద్ర , మల్లికార్జున, శేషు తదితరులు పాల్గొన్నారు.
- యస్.ఇస్మాయిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి, APTF, కర్నూలు జిల్లా