ఏపీటీఎఫ్ - ఆంధ్ర ప్రదేశ్* *అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని 13 జిల్లాలలో ఈ నెల 22.01.2018 వతేది వసంత పంచమి సందర్భంగా నిర్వహించాలని విద్యా శాఖ డైరెక్టర్ నుండి DEO లకు ఆదేశాలు అందాయి.* *అలాగే కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి పాఠశాల కు రూ 2500/-అకౌంట్ లో జమ చేశారు
FOR ORDER COPY CLICK HERE
అమ్మకు వందనం
మాతృమూర్తి విలువను తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమం 22న అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు మహిళలను దేవతలుగా పూజించే మన సంస్కృతిని ఆధునిక పోకడలు, పాశ్చాత్య విధానాలు మలినం చేస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుత సమాజంలో మహిళలంటే చులకన భావం ఏర్పడుతోంది. వారి సహన శీలత, దాన గుణం, నేర్పరితనం గురించి తెలియని విద్యార్థి లోకం కూడా అదే భావనతో పెరిగితే భవిష్యత్తులో మహిళలపై గౌరవం మరింత దిగజారే ప్రమాదం ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మకు వందనం’ పేరిట చిన్నారుల్లో స్ఫూర్తిని నింపే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. వాటి విశేషాలు మీ కోసం...
🌴🌱🚶
మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి. ప్రసవం అంటే తనకు మరో జన్మ అని తెలిసినప్పటికీ తన పంచ ప్రాణాలు ఒడ్డి బిడ్డకు ప్రాణం పోస్తుంది మాతృమూర్తి. అలాంటి తల్లి విలువను గుర్తించని కొందరు బిడ్డలు వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్న తమ తల్లులను ఊరిలో చెట్ల కింద, శిథిలమైన పాకల్లోనే వదిలేస్తూ మానవ జాతి తలదించుకొనేలా చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని కంభం మండలం లింగాపురం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన ఈ ఉదంతానికి ఓ ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు రోజు అనేకం బయటపడుతున్నాయి. కేవలం మహిళలు, తల్లులపై సదరు బిడ్డలకు గౌరవం, ప్రేమ లేకపోవడమే ఈ దుశ్చర్యలకు కారణం. ఇలాంటి తరుణంలో నేటి బాలలకు మాతృమూర్తుల విలువజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది.
*22న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం... *
‘అమ్మకు వందనం’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22న ప్రారంభిస్తారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక, ద్రవ్యసహాయక ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే అందరు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. ఖర్చుల నిమిత్తం జిల్లాలోని 327 ఉన్నత పాఠశాలకు ఒక్కో పాఠశాలకు రూ.2,500 చొప్పున నిధులు ప్రధానోపాధ్యాయుల ఖాతాకు జమ చేశారు.
*అసలు ఆంతర్యం ఇదీ... *
ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇండోనేషియా, ఫిన్‌లాండ్ దేశాల పర్యటించిన సందర్భంలో అక్కడి పాఠశాలల్లో ఏడాదికి ఒకసారి విద్యార్థులు తమ తల్లులకు పాఠశాలలో పాదపూజ చేస్తారని తెలుసుకున్నారు. మానవ సంబంధాలు మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని గుర్తించిన ఆయన దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏడాదిలో ఒక రోజు అమలు చేయాలని సంకల్పించారు. ఇదే విషయాన్ని 2017 ఫిబ్రవరి 12న జరిగిన అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటులో ప్రకటించారు. ఇందులో భాగంగానే 2017 ఏప్రిల్ 10 ప్రభుత్వ ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలోనే నిర్వహించేందుకు గాను జనవరి 22న ప్రారంభించనున్నారు. దీని నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా రూ.1.25 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని పాఠశాలలు దాతలు, ఔత్సాహికుల నుంచి సేకరించి ఖర్చు చేసుకోవాలని సూచించింది.
*కార్యక్రమ నిర్వహణ ఇలా... *
22న పాఠశాలలో విద్యార్థుల తల్లులను ఆహ్వానించి వారి పిల్లలతో పాదపూజ చేయిస్తారు. తల్లి ప్రాధాన్యాన్ని తెలియజేసే పాటలు, నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లి గొప్పతనంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి అదే రోజు సాయంత్రం బహుమతులు ప్రదానం చేస్తారు. ప్రతి తరగతిలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థుల మాతృమూర్తులను ప్రత్యేకంగా సన్మానిస్తారు. వారి నుంచి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన సూచనలు తీసుకుంటారు.
*అమ్మ విలువ మరచిపోకూడదు *
సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అన్ని వర్గాలు ఆలోచించాలి. తల్లిదండ్రులు లింగవివక్ష చూపరాదు. ఆధునిక సమాజంలో బాలికలపై అత్యాచారాలు, దాడులు జరగకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ఆడవారిపై గౌరవ భావాన్ని పెంపొందించాలి. అమ్మ విలువ, ఆమె త్యాగాని ఎవరూ మరిచిపోకూడదు. పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.