*

మెడికల్ రీయింబర్స్ మెంట్ (MR)ఆన్లైన్ విధానం*
*

వైద్య ఖర్చులు 50,000రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.*
*

ముందుగా మన MR కి సంబంధించిన డిశ్చార్జి సమ్మరీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, essentiality సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్ పిడిఎఫ్ ఫార్మాట్ లో 6kb నుండి 1mb సైజు లోపు ఉండేటట్లు స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.*
*

ఇపుడు www.cse. ap. gov. in వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.*
*

ఎడమ వైపు ఉన్న లింక్ లో E-office పై క్లిక్ చేయగానే కుడివైపు MR approvals కనబడుతుంది.దీనిపై క్లిక్ చేయాలి.*
*

వెంటనే స్క్రీన్ పై ఒక బాక్స్ కనబడుతుంది.అందులో యూజర్ name, పాస్స్వర్డ్ మరియు క్యాప్చ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.*
*

యూజర్ name - టీచర్ పని చేస్తున్న స్కూల్ dise కోడ్.*
*

పాస్స్వర్డ్ -Admin@2818(first 4 digits in school dise code)*
*

వెంటనే స్కూల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో MR సెలెక్ట్ చేసుకోవాలి.*
*

వెంటనే ఎంప్లాయ్ టైప్ దగ్గర inservice or pensioner సెలెక్ట్ చేయాలి.*
*

ఇపుడు స్క్రీన్ పై ఎంప్లాయ్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్లో పనిచేస్తున్న అందరి పేర్లు display అవుతాయి.*
*

ఇపుడు టీచర్ name సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే క్లెయిమ్ ఫారం వస్తుంది.*
*

ఇందులో టీచర్ పేరు, టీచర్ ID NO, ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్ డీ ఫాల్ట్ గా ఉంటాయి.*
*

క్లెయిమ్ ఫారం లో స్కూల్ వివరాలు, personal details, అడ్రస్,పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు పూర్తిచేసి proof in support of claim documents అప్లోడ్ చేయాలి.*
*

documents లో బిల్ నంబర్, తేదీ లను పూర్తి చేసి డిశ్చార్జ్ సమ్మరీ,essentiality సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, dependent సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయాలి.*
*

ఆనంతరం సబ్మిట్ నొక్కాలి.వెంటనే స్క్రీన్ పై successfully అని వస్తుంది.*
*

దీనిని ప్రింట్ తీసుకొని దానిని DDO ద్వారా MR క్లెయిమ్ దరఖాస్తు కి జతచేసి CSE కి పంపాలి.*