ఏపీటీఎఫ్
ప్రాయోజిత సమాచారం

SBI అకౌంట్ ని ఆన్ లైన్ ద్వారా వేరొక శాఖకు బదిలీ చేయు విధానం:

*◆పర్సనల్ బ్యాకింగ్‌ను ఎంచుకుని లాగిన్ వివరాలను నమోదు చేయాలి.*
*◆నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన తర్వాత ఈ-సర్వీసెస్ ఎంచుకోవాలి.*
*◆అక్కడ అందుబాటులో ఉన్న సేవల్లో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్‌పై నొక్కాలి.*
*◆ఇప్పుడు మీ ఖాతా నంబరు, బ్రాంచీ వివరాలు వంటివి ప్రత్యక్షమవుతాయి.*
*◆ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నా ఆ వివరాలన్నీ మీ ముందుంటాయి.*
*◆ఏ అకౌంట్‌ను వేరే బ్రాంచీకి మార్చాలనుకుంటున్నారో అక్కడ కొత్త బ్రాంచీ కోడ్ ఎంటర్ చేయాలి.*
*◆కోడ్ ఆధారంగా బ్రాంచీ పేరు ప్రత్యక్షమవుతుంది.*
*◆కన్‌ఫర్మ్ బటన్‌పై నొక్కితే, మీ నమోదిత మొబైల్ నంబరుకు OTP వస్తుంది.*
*◆తర్వాతి పేజీలో OTP ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ నొక్కాలి.*
*◆అక్కడ తెరపై వచ్చే సందేశంలో మీ బ్రాంచీ ట్రాన్స్‌ఫర్ అభ్యర్థన విజయవంతం అయినట్లు తెలుస్తుంది.*
*◆పొదుపు ఖాతాల్లో మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉంటేనే ఖాతా బదిలీ సాధ్యమవుతుంది.*
*◆ఖాతా బదిలీ ఆన్‌లైన్‌లో చేయాలంటే మీకు కచ్చితంగా నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండాలి.*
*◆కేవైసీ వివరాల వెరిఫికేషన్ కాని, ఇన్ఆపరేటివ్ ఖాతాలకు ఇది సాధ్యపడదు.*
*◆బ్రాంచీ కోడ్‌ను మొదటే సిద్దంగా ఉంచుకోవాలి.*
*◆ఖాతా బదిలీ అవాలంటే దాదాపు వారం రోజులు పడుతుంది.*