*ఏపీటీఎఫ్*
*నెల్లూరు సిటీ*
*అబ్బూరి శ్రీనివాస్, అధ్యక్షుడు*
*జి. శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి*
గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD శ్రీయుత కరికాల వలవన్ గారు ఇంటర్ సే సీనియారిటీ లిష్టుల తయారీలో సందేహాలకు క్లారీఫికేషన్ మెమో నెం. 881534/d1/2017-2 తేది 30-1-2018 విడుదల చేయటమైనది.
మున్సిపాలిటీలలో మరియు కార్పొరేషన్లలో క్రొత్త రోష్టరు ఫాలోకావాలనియు, విశాఖ, విజయవాడలలో పాతరోష్టర్ అనుసరించాలని క్లారీఫికేషన్ ఇవ్వటమైనది.
DSC 2000 ఉపాధ్యాయులకు విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ర్యాంకులు అందుబాటులో లేనికారణంగా మార్కుల ఆధారంగా ఇంటర్ సే సీనియారిటీ లిష్టులు తయారు చేయాలని, మిగిలిన జిల్లాల్లో ర్యాంకుల ఆధారంగా ఇంటర్ సే సీనియారిటీ లిష్టులు తయారు చేయాలని క్లారీఫికేషన్ ఇవ్వటమైనది.
GOMS NO 610 ద్వారా బదిలీ పొందిన ఉపాధ్యాయులను DSC మెరిట్ ద్వారా ఇంటర్ సే సీనియారిటీ లిష్టులు తయారు చేయాలని క్లారీఫికేషన్ ఇవ్వటమైనది.
OA NO 2953 OF 2017 ది 16-11-17 తేదీన గౌరవ APAT వారు కొట్టివేసినందున 10-10-17 పూర్వపు ఖాళీల ప్రశ్న అనవసరమని మునిసిపల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీసు రూల్సు ప్రకారం పదోన్నతులు చేపట్టవలెనని వివరణ ఇవ్వటమైనది.