ఈనెల 20లోగా మున్సిపల్ టీచర్ల బదిలీలు🌴
4 May 2018, 2:19 am
♦1500 మందికి బదిలీ అవకాశం: నారాయణ
టీచర్లకు పురపాలకశాఖా మంత్రి నారాయణ శుభవార్త అందించారు. 17 ఏళ్లుగా నిర్వహించని మున్సిపల్ టీచర్ల బదిలీల ప్రక్రియను ఈ నెలలో చేస్తామని చెప్పారు.
ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ జి.హృదయరాజు, కోచైర్మన్లు జి.నాగేశ్వరరావు, పి.కృష్ణయ్యతో గురువారం చర్చల సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
♦మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈనెల 15లోగా అంతర్ జిల్లాల బదిలీలు, 20లోగా జిల్లా స్థాయిలో బదిలీలు ఉంటాయని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో బదిలీలపై కూడా జీవో ఇస్తామన్నారు. సుమారు 1500 మంది ఉపాధ్యాయులకు బదిలీ అవకాశం ఉంటుందని ఆయన సూత్రప్రాయంగా చెప్పారు.
మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. 13 జిల్లాల్లో మున్సిపల్ పాఠశాలల్లో 1400 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.350 కోట్లను సీఎం చంద్రబాబు మంజూరు చేసినట్లు చెప్పారు. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించి, తనను కలిసిన, మున్సిపల్ పాఠశాల టీచర్లు, విద్యార్థులను మంత్రి అభినందించారు.
✊టీచర్ల బదిలీలపై మంత్రి గంటాకు విజ్ఞప్తి
జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా, సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వాలని మంత్రి గంటా శ్రీనివాసరావును కోరినట్టు ఫ్యాప్టో నాయకులు తెలిపారు.
మునిసిపల్ టీచర్ల బదిలీలు కోరుతూ ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ హృదయ రాజు గారు