AP EAMCET 2018 RESULTS
CLICK HERE TO OFFICIAL LINK
అమరావతి: ఏపీ ఎంసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12గం.కు విడుదలకానున్నాయి. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను విద్యార్థుల మొబైల్ నంబర్లకు మెసేజ్ ల రూపంలో పంపించనున్నారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు సమర్పించిన మొబైల్ నంబర్లకు ఈ మెసేజ్ లు వెళ్తాయి. ఎంసెట్ ఫలితాల కోసం
వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. కాగా, ఎంసెట్ ఫలితాలు టీవి స్క్రీన్ పై కూడా కనిపించనున్నాయి.
ఏపీ ఫైబర్‌నెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలు ఎంసెట్ విద్యార్థుల కోసం ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల టీవి స్క్రీన్ పై ఫలితాలకు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ టైప్ చేస్తే ఫలితాలు తెలుసుకోవచ్చు.