ఏపీటీఎఫ్
రాష్ట్ర కార్యాలయ విశేషాలు
ఈ రోజు సెక్రటేరియట్ లో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ఆదిత్యనాథ్ దాస్ గారిని కలసి అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా , ఉపాధ్యాయుల సాధారణ & MEO ల బదిలీలు జరపాలని, సర్వీస్ రూల్స్ కోర్టులో పెండింగులో వున్నందున పాత సర్వీస్ నిబంధనల మేరకు అన్ని క్యాడర్ ల పదోన్నతులు ఇవ్వాలని, జ్ఞానధార లాంటి కార్యక్రమాలు రూపకల్పన ముందు సంఘాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని, IIIT ప్రవేశాలలో గ్రామీణ ప్రాంత పాఠశాలల పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో ఏపీటీఎఫ్, Fapto ఇచ్చిన ప్రతినిధ్యాలపై చర్చించడం జరిగింది. హృదయరాజు తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల యమ్ యల్ సి బొడ్డు నాగేశ్వరరావు, కర్నూలు ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జి.సురేష్ రాజు లు పాల్గొన్నారు.
- జి.హృదయరాజు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్