APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF
Showing posts with label APTF. Show all posts
Showing posts with label APTF. Show all posts
గౌ౹౹ కమీషనర్ గారిచే సంక్రాంతి  సెలవల పొడిగింపు పై  తుది నిర్ణయం❓

గౌ౹౹ కమీషనర్ గారిచే సంక్రాంతి సెలవల పొడిగింపు పై తుది నిర్ణయం❓

Mohan
APTF Updated at: January 05, 2023

 గౌ౹౹ SCERT జాయింట్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్ డైరీ క్యాలండర్ అందించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు/ యస్.చిరంజీవి


@ సంక్రాంతి సెలవులు చాలా తక్కువగా ఇచ్చిన విషయం నిన్న గౌ౹౹ విద్యాశాఖ మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళామని,గౌ౹౹ మంత్రిగారు రెండురోజులు పెంచేవిధంగా చూస్తామని తెలియజేశారని,మీరు కూడా పరిశీలించమని ప్రతాపరెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయగా కమీషనర్ గారు వ్యక్తిగత పనిమీద బయట వెళ్ళి ఉన్నారు.వచ్చిన వెంటనే  సెలవుల విషయమై పరిశీలిస్తామని తెలియజేశారు

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్

Mohan
APTF Updated at: January 04, 2023

 ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.జవహర్ రెడ్డి గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.చిరంజీవి,రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు




జె.డి సర్వీసెస్ మువ్వారామలింగం గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్

Mohan
APTF Updated at: January 04, 2023

 APTF INFO:- జె.డి సర్వీసెస్ మువ్వారామలింగం గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్ డైరీ క్యాలండర్ అందించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు/ యస్.చిరంజీవి


@బదిలీలకు సంబంధించి కోర్ట్ కేసులకు కౌంటర్ సమాధానం ఇచ్చామని కోర్టు డైరక్షన్ బట్టి నిర్ణయాలు ఉంటాయని తెలియజేశారు


@మున్సిపల్ టీచర్స్ కు ఇంక్రిమెంట్స్ మరియు  మంజూరు ఇబ్బందిగా ఉన్న విషయం జె.డి గారి దృష్టికి తీసుకెళ్ళగా, ఎం.ఇ.ఓ లు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిడిఓ పవర్స్ ఇచ్చే పని జరుగుతుందని,ఉన్నత పాఠశాలల మ్యాపింగ్ పూర్తి కావచ్చినదని డిడిఓ కోడ్స్ కేటాయిస్తున్నామని,ఇంకా ప్రాధమిక పాఠశాలలు,యుపి స్కూల్స్ మ్యాపింగ్ కావలసి ఉన్నదని ఈపని జరిగే పే అండ్ అకౌంట్స్ డైరక్టర్ గారితో మాట్లాడి జనవరి నెల జీతాలకైనా డిడిఓ పవర్స్ ప్రయత్నం చేస్తామని తెలియజేశారు




బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ APTF ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు

బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ APTF ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు

Mohan
APTF Updated at: December 27, 2022

 ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆ సంఘ అధ్యక్షుడు హృదయరాజు, నెల్లూరులో జరిగిన నిరసనలో ప్రధాన కార్యదర్శి చిరంజీవి పాల్గొన్నారు. ధర్నాల్లో వారు మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదు’ అని పేర్కొన్నారు.



రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన దృశ్యాలు 


అనంతపురము జిల్లా

నెల్లూరు జిల్లా

గుంటూరు జిల్లా

కృష్ణాజిల్లా

విశాఖపట్నం జిల్లా

శ్రీకాకుళం జిల్లా

 ప్రకాశం జిల్లా


పెద్దల సభ ఎన్నికలకు బోగస్ ఓట్లు చేర్పించడం అనైతికం------- కడపలో ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.చిరంజీవి

Mohan
APTF Updated at: November 26, 2022

 మేధావులు ప్రాతినిధ్యం వహించే పెద్దల సభ ఎన్నికలకు అనర్హులను ఓటర్లుగా చేర్పించడం అనైతికమని కడపలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.చిరంజీవి అన్నారు




అర్హులను చేర్చడానికి సవాలక్ష అడ్డంకులు చెపుతూ అనర్హులను మాత్రం దొడ్డిదారిన ఓటర్లుగా చేర్పిస్తున్నారని వెంటనే బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.కార్పొరేట్ పాఠశాలల ఉపాద్యాయులకు జి.ఓ (1) ప్రకారం వేతనాలు అమలుచేయాలని ,తదుపరి ఓటర్లుగా కూడా అర్హత సాధిస్తారని,కార్పోరేట్ యాజమాన్యం జీతాలలో ప్రామాణికాలు పాటించకుండా ఓట్లు కోసం మాత్రమే వారి సంస్థలో పనిచేసే వారిని వాడుకొంటుందని విమర్శించారు.బడ్జెట్ స్కూళ్ళపై ప్రభుత్వ నిర్భందం తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, రాష్ట్రీయ పండిత పరిషత్ రాష్ట్ర అదనపు కార్యదర్శి బి.శివారెడ్డి, జిల్లా నాయకులు ఎఫ్.ఎం.ఎస్ ఖాదర్,ఎ.నరసింహారెడ్డి పాల్గొన్నారు

దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ రీఇంబర్స్ బిల్స్ పై ప్రాతినిధ్యం చేసిన APTF 1938

Mohan
APTF Updated at: November 09, 2022

 


AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన

Mohan
APTF Updated at: April 07, 2022

 



AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ నేడు ప్రారంభ రోజు విజయవాడ లెనిన్ సెంటర్ లో డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది. ఏప్రిల్ 7,8,9 తేదీల్లో APSEC భాగస్వామ్య సంఘాలు నిర్దేశించుకున్న మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా శాఖలకు తెల్పడమైనది.         ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సంఘాలు APTF:1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: హృదయ రాజు, కులశేఖర రెడ్డి DTF రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: కృష్ణయ్య , రెండు PDSU రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు రవిచంద్ర, రామకృష్ణ, రాజేష్ , APTF రాష్ట్ర కౌన్సిలర్ బిన్నీ, PDSU నాయకులు పాల్గొన్నారు


పది స్పాట్ వాల్యూయేషన్ ను 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలి: APTF

Mohan
APTF Updated at: April 07, 2022

 ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి కి APTF ప్రాతినిధ్యం




రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన 26 జిల్లా కేంద్రాల్లో 2022 పదో తరగతి పరీక్షా పత్రాల స్పాట్ వాల్యూయేషన్ జరపాలని ఆ మేరకు నేటి నుంచి ఏర్పాట్లు చేయాలని APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, కె. కులశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.


కరోనా మహమ్మారి కారణంగా 2021 - 22 విద్యా సంవత్సరం ఆలస్యమయ్యి పది పబ్లిక్ పరీక్షల అనంతరం మే 13 నుండి విపరీతమైన ఉష్ణోగ్రతల్లో స్పాట్ వాల్యూయేషన్  నిర్వహిస్తున్న కారణంగా ఉపాధ్యాయుల శ్రేయస్సు దృష్ట్యా పాత 13 జిల్లా కేంద్రాలు కాకుండా ఇప్పటికే విభజన చేయబడిన వాటితో పాటు అన్ని 26 జిల్లాల కేంద్రాల్లో పది మూల్యాంకనం నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవనంద రెడ్డి గారికి APTF ప్రాతినిధ్యం చేసింది.

C. P. S ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఎ.పి.టి.ఎఫ్ ( 1938)ధర్నా

Mohan
APTF Updated at: April 05, 2022

 


కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న APTF రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు


అనంతపురం APTF ధర్నా లో  మాట్లాడుతున్న APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కులశేఖర్ రెడ్డి


అనంతపురం జిల్లా ధర్నా లో పాల్గొన్న APTF కార్యకర్తలు, ఉపాద్యాయులు

టెక్కలి, నందిగాం మండలాల కార్యకర్తలు. సీపీయస్ రద్దు కోసం పాతపెన్షన్ విధానం కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం : శ్రీకాకుళం

టెక్కలి, నందిగాం మండలాల కార్యకర్తలు. సీపీయస్ రద్దు కోసం పాతపెన్షన్ విధానం కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం : శ్రీకాకుళం


విజయనగరం లో నేడు జరుగుతున్న ధర్నా లో పాల్గొన్న రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ A. Sada Shiva Rao, అదనపు కార్యదర్శి శ్రీ ఆర్. కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ Y. Madhu.


CPS రద్దు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం APTF-1938 కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న దర్నా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న  సీనియర్ ఉద్యమనాయకులు AV RAMARAO గారు(వయస్సు90 సంవత్సరాలు) వీరి ఉద్యమ స్పూర్తికి ఉద్యమాభివందనాలు

ఈరోజు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న సిపిఎస్ రద్దు ధర్నా గురించి ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఐఫియా జాతీయ నాయకులు శ్రీ K.సుబ్బారెడ్డి గారు.


ఈరోజు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న సిపిఎస్ రద్దు ధర్నా గురించి ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మరియు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ K.వెంకటేశ్వరరావు గారు

ఈరోజు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న సిపిఎస్ రద్దు ధర్నా గురించి ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు  శ్రీ N.మోహన్ దాస్ గారు


ఒక్క పోస్ట్ రద్దు కాదు..ఒక్క స్కూల్ మూతపడవు...అంటే అర్థం ఇదా.? APTF ఖండన

Mohan
APTF Updated at: March 25, 2022

 APTF ఖండన


ఒక్క పోస్ట్ రద్దు కాదు..ఒక్క స్కూల్ మూతపడవు...అంటే అర్థం  ఇదా.?.ఇంకా ఎన్ని మూయడాలుంటాయో !! 


- APTF:1938


యస్.జి టీచర్స్ ను మోడల్ స్కూల్స్ కు  4764 బదలాయిస్తు పోస్టులను రద్దు చేయడం వల్ల ప్రాథమిక విద్య నాశనం అవుతుందని, విద్యా శాఖలో ఏ అవసరం వచ్చినా SG పోస్టులను రద్దు చేయడం ఆనవాయితీ అయింది. ఈ విధానాన్ని కాకుండా పోస్టులను క్రియేట్ (సృష్టించి ) చేసి మార్పులను చేసుకోవాలని, ప్రాథమిక విద్య ను బలోపేతం చేయాలని, నూతన DSC ప్రకటించాలని APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








ఇచ్చిన హామీ మేరకు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి. - ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

Mohan
APTF Updated at: March 20, 2022

ఇచ్చిన హామీ మేరకు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి.  

- ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయ రాజు.     


కర్నూలు జిల్లా, బనగానపల్లె APTF ప్రాంతీయ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు:జి.హృదయ రాజు


బనగానపల్లె డివిజన్ ఏపిటిఎఫ్ కార్యకర్తల ప్రాంతీయ సమావేశం ఏపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.మాధవ స్వామి అధ్యక్షతన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయ రాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలకు  పెను భారంగా, గుదిబండగా ఉన్న సి పీ ఎస్ విధానాన్ని ఇచ్చిన హామీ మేరకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే  రిటైర్డ్ అయినప్పుడు భద్రత లేని CPS పెన్షన్ రావడంతో జీవితం గడవక భారంగా గడపాల్సి వస్తుందని తెలిపారు. కనుక వెంటనే సిపిఎస్ రద్దు చేసి  పాత పెన్షన్ లోకి ఉద్యోగులను తీసుకొచ్చి వారి జీవితాలలో వెలుగు నింపాలని కోరారు. అంతేగాక ప్రాథమిక పాఠశాలలను విడగొట్టి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు కలపడం వల్ల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు ఆక్కడికి చేరుకోలేక బడి మానేసి నిరక్షరాస్యులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . జాతీయ విద్యా విధానం లోపభూయిష్టమైన మరియు  ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి విరుద్ధమైనదిగాను ఉన్నందున వెంటనే రద్దు చేయాలని పిలుపునిచ్చారు. భిన్న భాషలు భిన్న సంస్కృతులు ఉన్న మన రాష్ట్రంలో వివిధ భాషల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా ఒకే భాషలో ఆంగ్ల భాషలోనే విద్యాబోధన అభ్యసించాలన్న నిర్ణయం అసంబద్ధ నిర్ణయం అని తెలిపారు. పెండింగ్లో ఉన్న అనేక ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. 


అనంతరం బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల ,ఉయ్యాలవాడ మండలాల కార్యవర్గ సభ్యులును ఎన్నుకోవడం జరిగింది. ఏపిటిఎఫ్ బనగానపల్లె మండలం గౌరవ అధ్యక్షులుగా గోపాల్ రావు, అధ్యక్షులుగా జె. వెంకట కృష్ణుడు, ప్రధాన కార్యదర్శిగా సుంకన్న అవుకు మండలం ఏపిటిఎఫ్ గౌరవ అధ్యక్షులుగా నాగార్జున, అధ్యక్షులుగా జి. లింగమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్. ఓబులేసు, కొలిమిగుండ్ల మండల గౌరవ అధ్యక్షులుగా బి. ప్రభాకర్ అధ్యక్షులుగా పి.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి.విజయ భాస్కర్, సంజామల మండలం గౌరవ అధ్యక్షులుగా రాఘవయ్య, అధ్యక్షులుగా హరిబాబు , ప్రధాన కార్యదర్శి  పరమేశ్వరుడు, ఉయ్యాలవాడ  మండలం గౌరవ అధ్యక్షులుగా రమణ, అధ్యక్షులుగా రామాంజనేయులు ,ప్రధాన కార్యదర్శిగా చిన్న చెన్నయ్య ఐదు మండలాల సబ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ లు మధుసూదన్ రావు, నాగరాజు, సీనియర్ నాయకులు లాజరస్, సుబ్బరాయుడు,కె. రమేష్, ఈరన్న, రఫీ, కృష్ణమూర్తి ఎం. రమేష్, దస్తగిరి , చౌడయ్య, జోసెఫ్  మరియు అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

APTF పక్షాన ట్రెజరీ & CFMS సమస్యలను సంబంధిత అధికారులను కలసి ప్రాతినిధ్యం

Mohan
APTF Updated at: March 19, 2022

 APTF పక్షాన ట్రెజరీ & CFMS సమస్యలను సంబంధిత అధికారులను కలసి ప్రాతినిధ్యం చేయడమైనది


సీనియారిటీ జాబితాలపై విద్యాశాఖకు లేఖ: ఏపీటీఎఫ్

సీనియారిటీ జాబితాలపై విద్యాశాఖకు లేఖ: ఏపీటీఎఫ్

Mohan
APTF Updated at: March 09, 2022

 పాఠ శాల విద్యలో ఎయిడెడ్ టీచర్ల విలీ నంలో భాగంగా ఉపాధ్యాయుల సీని యారిటీ జాబితాలను సిద్ధం చేయ డంపై విద్యాశాఖ కమిషనరు ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృ ద యరాజు, కె. కులశేఖర్ రెడ్డి లేఖ రాశా రు. ప్రభుత్వ, మునిసిపల్, పీఆర్ పాఠశాలల్లోని ఎయిడెడ్ ఉపాధ్యా యులను చేర్చుకునేటప్పుడు వెబ్ ఎంపికల కోసం అన్ని ఖాళీలను ప్రద ర్శించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయు ల సీనియారిటీ జాబితా లను సీఈఈ ప్రొసీడింగ్ ప్రకారం అర్హత పాయిం ట్లను అం దించడం ద్వారా సిద్ధం చేయాలని కోరారు.

విషం చిమ్మే వ్యూహం!Jan 23 2022 @ 03:11AM  సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం

విషం చిమ్మే వ్యూహం!Jan 23 2022 @ 03:11AM సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం

Mohan
APTF Updated at: January 23, 2022

  •  విషం చిమ్మే వ్యూహం!

  • సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం
  • Jan 23 2022 @ 03:11AM

జీతం పెరిగిందంటూ కరపత్రాల ముద్రణ
వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీసోషల్‌ మీడియాలోనూ ఉద్యోగులు టార్గెట్‌పనిచేయని, లంచావతారాలుగా చిత్రీకరణవారికెందుకు ఇంత జీతమని ప్రశ్నలుదీటుగా బదులిస్తున్న ఉద్యోగులుతప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రజలకు వినతి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)‘మేం ఇచ్చినంత తీసుకోవాలి. మీరు అడిగినంత మేం ఇవ్వం’ అంటున్న వైసీపీ సర్కారు ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించింది. ఇందుకు వలంటీర్లతోపాటు సోషల్‌ మీడియానూ విస్తృతంగా వాడుకుంటోంది. ‘ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి. వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లండి. మన వాదన వినిపించండి’ అని స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన మంత్రివర్గ సహచరులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ‘ఉద్యోగులు కోరినట్లుగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తే, ఏదైనా పథకాన్ని ఆపాల్సి ఉంటుంది’ అని కూడా అన్నారు. వెరసి... ఉద్యోగుల ప్రయోజనాలకు వారి ఇవ్వడం పేదల వ్యతిరేక చర్యగా చిత్రీకరించారు. ఇప్పుడు ఉద్యోగులపై కరపత్రాల యుద్ధం కూడా మొదలైంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో జీతాలు ఎలా పెరుగుతాయంటే... అంటూ ఒక పట్టికతో కరపత్రాలు ముద్రించారు. వాటిని వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంచడం మొదలుపెట్టారు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించి, సీసీఏ ఎత్తివేసినప్పటికీ జీతాలు పెరుగుతాయా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడంలేదు. ‘ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకేసారి కలిపేసి... జీతం పెరిగిందంటే ఎలా? అలా చూసినా జీతం తగ్గుతుందే తప్ప పెరగదు’ అని ఉద్యోగులు చెబుతున్నారు. అయినా సరే... జనవరి 1వ తేదీన తీసుకున్న జీతం, ఫిబ్రవరి 1న తీసుకోబోయే జీతం అంటూ ప్రభుత్వం ఒక కరపత్రాన్ని రూపొందించింది. ‘‘మొత్తంగా జీతాలు పెరుగుతున్నాయా? లేదా? అదే చూసుకోవాలి. బేసిక్‌ పెరగడం ద్వారా అదివరకు అందే గ్రాస్‌ శాలరీకన్నా, పీఆర్సీ తర్వాత అందుతున్న గ్రాస్‌ శాలరీ పెరగడం లేదా? అంటే జీతాలు పెరుగుతున్నాయా, లేవా అనే విషయాన్ని గమనించాలి. కొత్త పీఆర్సీతో జీతాల కోత అవాస్తవం. అడగకపోయినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న మాట నిజం కాదా?’’ అని ఈ కరపత్రంలో ప్రశ్నించింది. వీటిని ఇంటింటికీ పంచుతూ... జీతాలు తగ్గాయన్న ఉద్యోగుల వాదనలో నిజం లేదని ప్రచారం చేయాలని వలంటీర్లను ఆదేశించింది.
సోషల్‌ మీడియాలోనూ...ఉద్యోగులపై బురదజల్లేందుకు సోషల్‌ మీడియాను కూడా వైసీపీ వాడుకుంటోంది. తన సోషల్‌ మీడియా సైన్యాన్ని ఉద్యోగులపైకి ఉసి గొల్పుతోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ఉద్యోగులకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని, లంచావతారాలని... ఇంకా ఎందుకు జీతాలు పెంచాలని పోస్టులు పెడుతున్నారు. ఇక... టీచర్లను మరింతగా టార్గెట్‌ చేస్తున్నారు. ‘‘టీచర్లు చేసేది ఎమిటి? ఎన్ని సెలవులు? ఎన్ని రోజులు పని చేస్తున్నారు? ఎంత జీతం? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసే ఉపాధ్యాయులకు వేతనాల పెంపు ఎందుకు? ప్రభుత్వ టీచర్ల జీతమెంత... ప్రైవేటు స్కూలు టీచర్లకు జీతమెంత?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఇక... ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలను బహిరంగంగా ప్రదర్శించాలన్నది కొందరి డిమాండ్‌! ఇలా రకరకాల పోస్టులతో ఉద్యోగులను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ఉద్యోగులూ ఆలోచించండి’ అంటూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు చెప్పిన వివరాలతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అదే అస్త్రం... ఇప్పుడు ఉద్యోగులపైకి!వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక సోషల్‌ మీడియాను రెండు రకాలుగా ఉపయోగించుకుంటోంది. ఒకటి... తాము తీసుకోబోయే నిర్ణయాలకు అనుకూలంగా ముందుగానే ప్రచారం చేయడం. రెండు... గతంలోలాగా తమను వ్యతిరేకించే వారిపై విమర్శలు గుప్పిస్తూ, వారిని ఆత్మరక్షణలోకి నెట్టడం. తాజాగా... సినిమా టికెట్ల వివాదంపైనా ఇలాగే చేశారు. ‘సినిమా వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా! వాళ్లేమైనా సమాజ సేవ చేస్తున్నారా?’ అని దుమ్మెత్తి పోశారు. అమరావతి రైతుల పాదయాత్రపైనా సోషల్‌ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారానికి దిగారు. ఇప్పుడు... ప్రభుత్వ ఉద్యోగులపైనా పడ్డారు.
దీటుగా ఉద్యోగుల అస్త్రాలు...‘ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి’ అంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలతోపాటు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఉద్యోగులూ దీటుగా స్పందిస్తున్నారు. ‘కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయి అంటున్నారు కదా! మాకు అది వద్దు. ఐదు డీఏలు కలిపేసి... 27 శాతం ఐఆర్‌ ఉన్న పాత జీతమే ఇవ్వండి. డబ్బులు ఆదా చేసుకోండి’ అని చురకలు అంటిస్తున్నారు. కొత్త పీఆర్సీతో తమకు జరిగే నష్టాన్ని లెక్కకట్టి వివరిస్తున్నారు. ‘‘రివర్స్‌ పీఆర్సీ ఇచ్చారు. ఐదు డీఏలు కలిపేసి.. జీతం తగ్గకపోవడమే మహాభాగ్యం అంటున్నారు. గత ప్రభుత్వాలు అందించిన ప్రయోజనాలకూ కోత పెడుతున్నారు. ఇదేం న్యాయం అని అడిగిన మాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది పద్ధతి కాదు’’ అని ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు.
రెచ్చగొట్టడం సరికాదు‘‘న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాలు, హక్కుల కోసం సమాజంలోని వివిధ వర్గాలు పోరాటాలు చేయడం సహజం. వీరిపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రభుత్వం సమాంతర ప్రచారం చేయడం తగదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య విద్వేషాలు సృష్టించడం మానుకోవాలి. ప్రభుత్వానికి మేమూ సమాధానం ఇస్తాం. బహిరంగంగానే స్పందిస్తాం!’’        - హృదయరాజ్‌, ఏపీ జేఏసీ

వైసీపి అధికార పార్టీ వారి ప్రశ్నలకు APTF:1938 జవాబులు

Mohan
APTF Updated at: January 23, 2022

 




.




న్యాయమైన ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. - జి.హృదయ రాజు, సెక్రెటరీ జనరల్, ఏపీ జెఏసి

Mohan
APTF Updated at: December 09, 2021

 రాష్ట్రంలోని న్యాయమైన ఉపాధ్యాయ, ఉద్యోగులు, కార్మిక,పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ జెఏసి సెక్రెటరీ జనరల్ & APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు అన్నారు. APJAC & APJAC అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన కార్యాచరణ పిలుపు మేరకు రెండవ రోజు కర్నూలు పట్టణంలోని మార్కెట్ వద్దగల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో భోధన మరియు బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెల్పారు.ఈ సందర్భంగా హృదయ రాజు మాట్లాడుతూ 13 లక్షల మంది

ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక,పెన్షనర్లకు సంబందించిన 71 సమస్యలపై డిసెంబర్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నోటీసు సమర్పించి ఉద్యమంలోకి వచ్చామని, అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం గర్హనీయమని అన్నారు. 


PRC నివేదిక పబ్లిక్ డొమైన్ లో వుంచి సంఘాలతో చర్చించి 55% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, CPS ను రద్దు చేయాలని, 7 DA లను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్ & సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ గడువు పెంచాలని, విద్యారంగ, వైద్య విభాగంలోని సమస్యలను మరియు వివిధ శాఖలలో వున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.


ఈ నిరసన కార్యక్రమంలో APTF జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.కమలాకర రావు, రాష్ట్ర కౌన్సిలర్స్ కె.మద్దిలేటి, నాగేశ్వర రావు, దాదాపీర్ జూనియర్ అసిస్టెంట్ ల సంఘం నాయకులు అన్వర్ , పాఠశాలలోని మహిళా టీచర్స్ పాల్గొన్నారు.



నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న జి.హృదయ రాజు


సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటం  ♦ ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ పిలుపు

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటం ♦ ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ పిలుపు

Mohan
APTF Updated at: December 02, 2021

  •  సర్కారుపై సమరశంఖం
  • సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటం
  • ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ పిలుపు
  • వెంటనే పీఆర్సీ అమలు చేయండి
  • హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్‌ రద్దు చేయాలి
  • చేసిన పనికి మా కూలి ఇవ్వండి
  • లేదంటే 7 నుంచి రోజువారీ నిరసనలు
  • పరిష్కరించకుంటే ఉద్యమం మరింత ఉధృతం
  • జేఏసీ నేతలు బండి, బొప్పరాజు హెచ్చరిక 
  • సీఎ్‌సకు ఉద్యమ కార్యాచరణ నోటీసు


    ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 7 నుంచి రోజు వారీ నిరసనలు చేపడతామని ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ నేతలు హెచ్చరించారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని దశల వారీగా మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు 5 పేజీలతో కూడిన నివేదికను ఉద్యమ కార్యచరణ నోటీసు రూపంలో అందజేశారు. అనంతరం ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని లేకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.


♦‘‘ఇరు జేఏసీల పక్షాన సీఎ్‌సకు ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీసు ఇచ్చాం. గత నెల రోజుల నుంచి కూడా అనేక దఫాలుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్‌, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌.. ఇలా అధికారులను కలిసి మా సమస్యలు వివరించాం. 11వ పీఆర్సీ ఇవ్వాలని విన్నవించాం. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరాం. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని, డీఏలు ఇవ్వాలని కోరాం. మేం దాచుకున్న డబ్బులు ఇవ్వాలని, ఏపీజీఎల్‌ఐ డబ్బులు ఇవ్వాలని అడిగాం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరాం. రెండు నెలలుగా తిరిగినా ప్రయోజనం లేదు. ఏ ఒక్క డిమాండ్‌ పరిష్కరించని కారణంగానే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంటు అని, నెలాఖరుకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినా కూడా ఆ మాటలు కన్నీటి మూటలయ్యాయి’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. ‘‘ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వెళుతున్నామంటే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఎలా చర్చించాలని సీఎ్‌సకు తెలిపాం. నివేదికలో ఏమైనా చెప్పకూడని అంశాలు ఉన్నాయా? ఉద్యోగులను కించపరిచేలా మంత్రి బుగ్గన  వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకసారేమో ఉద్యోగులకు జీతభత్యాలు ఎప్పుడోసారి వస్తున్నాయి కదా అని అంటున్నారు. మరోసారి అసెంబ్లీలో 90 శాతం పేద ప్రజలకు ఇవ్వాలా? 10 శాతం మంది ఉద్యోగులకు ఇవ్వాలా అని అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల గురించి మాట్లాడుతున్న బుగ్గన ఏ రోజైనా ఉద్యోగులకు అందుబాటులో ఉన్నారా? మంత్రి అనుకున్న పేద ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు? ఉద్యోగులు కాదా’’ అని  ప్రశ్నించారు. మేం పని చేసిన దానికి మా కూలీ మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని ఏ ఒక్క అదనపు డిమాండ్‌ అడగడం లేదు.


♦చట్టబద్ధంగా మాకు ఇవ్వాల్సినవి అడుగుతున్నాం. ప్రజలు గమనించాలి’’ అని బొప్పరాజు అన్నారు. డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యాచరణ కార్యక్రమాలను ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీలు ఖరారు చేశాయి. తొలిదశ కార్యాచరణలో భాగంగా 7వ తేదీ నుంచి 10 తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామంలో నిరసనలు తెలుపుతారు. 13న అన్ని మండల, డివిజన్ల స్థాయుల్లో నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తారు. 16న తాలుకా, డివిజన్‌ అధికారుల కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తారు. 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహాధర్నాలు నిర్వహించనున్నారు. 27న విశాఖపట్నం, 30వ తేదీన తిరుపతి, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో నాలుగు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే రెండో దశ కార్యాచరణలోకి వెళ్లనున్నారు.

Composite School Grants పెరిగిన ఎన్రోల్మెంట్ ఆధారంగా మంజూరుకు APTF పక్షాన SPD గారికి ప్రాతినిధ్యం.

Mohan
APTF Updated at: November 26, 2021

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో  జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

Mohan
APTF Updated at: November 18, 2021

  • విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో సుహృద్భావ వాతావరణంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
  • 4వ జోన్ లో జారీ చేసిన చార్జి మెమో లను రద్దు చేస్తాం: ముఖ్య కార్యదర్శి

            నేడు విద్యారంగ - ఉపాధ్యాయుల సర్వీస్ మేటర్ లపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ.బి. రాజశేఖర్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉపాధ్యాయ సంఘాలు STU, UTF, APTF:1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఇబ్రహీంపట్నం లోని పాఠశాల విద్య డైరోక్టరెట్ లో రాత్రి వరకు జరిగింది.

            మూడు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడికి బోధనేతర పనులైన యాప్స్, పరిశుభ్రత, ఆన్లైన్ హాజరు తదితర పనుల వల్ల బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెల్పారు. తప్పు లేకపోయినా మెమో లు ఇస్తున్నారని, వాటిని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపకల్పన చేసి అన్ని క్యాడర్ల పదోన్నతులు, జేయల్  పదోన్నతులు, నాడు నేడు పనులు పూర్తి చేసిన వారికి ఈ.యల్స్,  అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు, 3,4,5 తరగతుల వీలీనం, అమ్మ ఒడి కి సంబంధించి హాజరు,  2003 DSC టీచర్లకు & 2002 పండిట్ల కు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు తదితర అనేక సమస్యలను ముఖ్య కార్యదర్శి గారికి వివరించడం జరిగింది.

            ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ గారు అనేక విషయాలపై మాట్లాడుతూ యాప్స్ భారం తగ్గిస్తామని, అన్ని కేడర్ల పదోన్నతుల కల్పనకు కృషిచేస్తున్నామని, 4వ జోన్ లో HM లకు జారీ చేసిన 2500 చార్జి మెమో లను రద్దు చేస్తామని, జీతాల సమస్య ఉన్న వాటిని అధికమించి జీతాల మంజూరు చేస్తామని అన్నారు. సంఘాలు - ప్రభుత్వం సమన్వయంతో పని చేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేద్దామని తెల్పారు. డైరెక్టర్ చిన వీరభద్రుడు మాట్లాడుతూ ఇకనుండి క్షేత్ర స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, టీచర్లను, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను అధిగమించి విద్యావ్యవస్థను ప్రగతి పథంలో నడిపిద్దామని అన్నారు. SPD వెట్రి సెల్వి, IAS అధికారులు మురళి, MDM మైదెన్ లు మాట్లాడారు. 

        ఈ సమావేశంలో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ సంఘాలు STU నుండి రఘునాథ రెడ్డి, సురేష్, UTF నుండి యన్.వెంకటేశ్వర్లు, KVVS ప్రసాద్, APTF:1938 నుండి జి.హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ లు ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామలింగం, నాగేశ్వర రావు, మధుసూదన్ రావు, రవీంద్ర నాథ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

బోధనకు ఆటంకం కలిగిస్తున్న APPS ను తక్షణమే రద్దు చేయాలి : APTF State Pre...

Mohan
APTF Updated at: November 04, 2021

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |