ఏపీటీఎఫ్: 08.06.2018
👉మున్సిపల్ ఉపాధ్యాయుల Phase-1 బదిలీల ఉత్తర్వుల త్వరగా జారీ చేయాలనీ సెక్రటేరియట్ లో ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు Pursue చేయడం జరిగింది.బదిలీ కోరుకున్న వారి దరఖాస్తులను ప్రక్రియలో భాగంగా సోమవారం సెక్షన్ నుండి అధికారులకు submit చేస్తారు. 2సం. లు అవకాశం కల్పిస్తూ చేసే బదిలీల ఫైల్ Process లో ఉంది.
👉అంతర్జిల్లా (ZP/Govt) బదిలీల దరఖాస్తులు 503. ఈ ఫైల్ సెక్రెటరియట్లో సెక్షన్లోనే ఉంది. త్వరగా చేపట్టాలని కోరడమైనది. GAD విభాగానికి కూడా వెళ్ళాల్సివుంటుంది.
👉2008 హామీ పత్రాల ఫైల్ ఆర్టికశాఖ (మంత్రి/ స్పెషల్ ప్ర.కా) కు మళ్ళీ పంపి అనుమతి పొంది జి.ఓ జారీ చేస్తారు.
👉పాత సర్వీస్ రూల్స్ విధానంలో అన్ని కేడర్ల పదోన్నతులు జరిపే ఫైల్ న్యాయశాఖ లో ఉంది.
👉 11వ పీఆర్సీ కమీషన్ కు ఛైర్మన్ గా ఆశీతోష్ మిశ్రా రిటైర్డు ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉంది. 10వ పీఆర్సీ అర్రియర్స్... పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక నెల నగదు, 9 నెలలు పీఎఫ్ ఖాతా, పెన్షనర్లు, సిపియస్ వారికి 3 నుండి 5 విడతల్లో చెల్లింపు. ఫైల్ ఆర్థికమంత్రి యనమలకు చేరిక... తదుపరి ముఖ్యమంత్రి... అనంతరం జి.ఓ జారీ.
👉4.5.2010 నుండి (Retraspective Effect) పదవీవిరమణ పొందిన ZP/Mpl/Aided బోధన & బోధనేతర సిబ్బందికి అర్ధ వేతన సెలవుల (HPL) ను నగదుగా మార్చుకునే సౌకర్యం జి.ఓ నెం:90 సాధించడం అతిగొప్ప విజయం. ఏపీటీఎఫ్/ఫ్యాఫ్తో/యం.యల్ సి లు కృషి ఉన్నది. కోర్టు అనుకూల తీర్పు ఉపకరించింది.అనంతరం ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు.
- Pr:కె.వెంకటేశ్వరరావు & GS: జి.హృదయరాజు, APTF