FAPTO:
*
FAPTO దశలవారీ పోరాటాల ప్రభావం జులై 20న ప్రభుత్వం FAPTO తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చల మినిట్స్ ను FAPTO కు అందజేశారు.
*
👉స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు బడ్జెట్ అంచనా రూ. 669/- కోట్ల వేయగా , ఇది తప్పుడు అంచనా అని నిలదీసి, రమారమి
(130 కోట్లు లోపు ) బడ్జెట్ ను రూపొందింపచేయునట్లు త్వరలో జీవో వచ్చేలా కృషి,
*
👉సర్వీస్ రూల్స్ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి,
కోర్టు కేసులను అధికమించి నిలిచిపోయిన అన్ని కేడర్ల పదోన్నతులు ఇవ్వాలన్న దానిపై శీగ్రంగా కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించి త్వరలో పదోన్నతులు వచ్చే అవకాశం,
*
👉 ఖాళీగా ఉన్న Dy.EO & MEO పోస్టులకు ఉన్నత పాఠశాలల సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలన్న డిమాండ్ పై ఇప్పటికే అమలు చేయడం & ఇంకా కొంత న్యాయపరంగా అధికమించాల్సి ఉంది.
*
👉 విశాఖపట్నం కేంద్రంగా మరో RJD పోస్ట్ సృష్టికి మార్గం
*
👉 అంతర్జిల్లా టీచర్ల బదిలీలు ఆలస్యం కాకుండా Fapto సూచనల మేరకు తక్షణ చర్యలకు స్వీకారం.
*
👉పండిట్ , పిఈటీ పోస్టులను మిగిలిన 30% కూడా సాంకేతిక సమస్యలేకుండా విడివిడిగా ఫైల్ పంపాలని , డీఈఓ పూల్ లో వున్న పిఈటీ లకు న్యాయం చేయాలని, ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా Upgradation చేయాలని డిమాండ్ పై ప్రభుత్వ కార్యదర్శి తగు చర్య
*
👉 ఉన్నత పాఠశాలల HM ల DDO అధికారుల కొనసాగింపు, Dy.EO పోస్టుల్లో ZP Dy EO, RMSA wing include చేయుటకు
*
👉 ప్రతి MLA నియోజకవర్గ పరిధిలో ఒక DyEO పోస్ట్ మంజూరుకు చర్యలు
*
👉 డియస్సి-18 లో ఖాళీగా వున్న అన్ని కేడర్ల ఖాళీలను పూర్తి చేయాలని, ప్రాధమిక పాఠశాలల్లో కనీసం 2 పోస్టులు, అప్గ్రేడ్ ఐన యూ. పి పాఠశాలలకు, మీడియా పరంగా స్టాఫ్ పాటర్న్ ప్రకారం పోస్టుల భర్తీ,
354 Upgrade Gr-1 HM ల భర్తీ,
పండిట్ & పిఈటీ పోస్టుల 100% ఉన్నతీకరణ పై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ప్రయత్నం
*
👉 విద్యారంగ సమస్యలు పాఠ్యపుస్తకాలు, సమారుప దుస్తులు, సైకిళ్ళు పంపిణీ, DCEB ద్వారా పరీక్షల నిర్వహణ తదితర అనేక సమస్యలపై పురోగతి మినిట్స్ ఉత్తర్వుల్లో చూడవచ్చు.
*
మిత్రులారా !
FAPTO విద్యారంగ - ఉపాధ్యాయుల సమస్యలపై జులై 20 న చర్చల ప్రగతి మాత్రమే కాదు... మున్సిపల్ టీచర్ల బదిలీలు,
పదోన్నతులు,
పి.ఎఫ్ సౌకర్యం మరియు దుర్మార్గమైన సిపియస్ విధానం రద్దు పై రాజీలేని పోరాట కార్యాచరణ మీకు తెలియంది కాదు.
*
పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యం అని ముందుకెళ్తున్న FAPTO కు మీవంతు సహకారం ఉంటుందని మరెన్నో విజయాలు FAPTO సొంతం కాబోతున్నాయని తెల్పుతూ....
*
ఇట్లు
చైర్మన్: పి.బాబురెడ్డి, సెక్రెటరీ జనరల్: జి.హృదయరాజు,
కో-చైర్మన్స్: జి.నాగేశ్వరరావు, పి.పాండురంగవరప్రసాద్,
పి.కృష్ణయ్య, జి.వి.నారాయణరెడ్డి డిప్యూటీ సెక్రటరీ జనరల్స్:
సిహెచ్. శరత్ చంద్ర, యమ్. రవిచంద్రకుమార్, కార్యదర్శులు: యమ్.బి. రాజేంద్రప్రసాద్,
బి.కరిముల్లా రావు, కె.ప్రకాష్ రావు, కోశాధికారి: జి.శౌరిరాయలు & కార్యవర్గ సభ్యులు:కె.వెంకటేశ్వరరావు, FAPTO