●జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా ఈ నెల 13న పాఠశాలలో “అమ్మకు వందనం ” కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది.
●తల్లిని మించిన దైవం లేదని, మనకు ఊపిరిపోసే తల్లిని ఎంత పూజించిన ఆమె రుణం తీర్చుకోలేము. విద్యార్థుల్లో మనసులో అమ్మ గొప్పతనాన్ని తెలియజేయాలి.
●ఈ కార్యక్రమ నిర్వహణకు 2500 రూపాయలు అకౌంట్ లో వేయడం జరిగింది, మరో 2,500 దాతల సహకారం నుండి మొత్తం ఐదు వేల రూపాయలు ఖర్చు చేయవలెను.
●విద్యార్థులు తల్లి యొక్క పాదాలను నీటితో కడగా వలెను. మరియు తల్లి యొక్క పాదాలను పుష్పములతోను అక్షింతల తోనే పూజించవలెను.
●ప్రతి ఒక్క విద్యార్థి తనకు జన్మనిచ్చినందుకు ఆశీర్వాదం తీసుకొనవలెను.
●ఉపాధ్యాయులు తల్లి యొక్క ప్రాధాన్యత గురించి ఉపన్యాసం ఇవ్వవలెను.
●విద్యార్థులకు డిబేట్, క్విజ్ , వ్యాసరచన పోటీలను నిర్వహించ వలెను. సాంస్కృతిక కార్యక్రమాలు తల్లి యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహించ వలెను.
●ఈ కార్యక్రమానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను ఆహ్వానించ వలెను.
●విద్యార్థుల తల్లిదండ్రులను అందరిని ఆహ్వానించ వలెను.
●ఈ కార్యక్రమానికి ఊరి పెద్దలను , మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ , ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్ పి టి సి ,చైర్మన్ , దాతలు , పత్రికా విలేఖర్లు మరియు గ్రామ ప్రజలను ఆహ్వానించాలని..
●అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలను.
●పాఠశాలలో సభా ప్రాంగణం సిద్ధం చేసుకోవాలని.
విద్యార్థులకు అవసరమైన పూజా సామాగ్రిని మరియు పూలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించడం జరిగింది.
●ఈ కార్యక్రమం అన్ని యాజమాన్య పాఠశాలలో జరుగునట్లు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలివ్వాలని మరియు పర్యవేక్షణ చేయాలని ఆదేశించడం జరిగింది.