font-family: 'Ramabhadra', sans-serif;
రా .. చిన్నా!...నేర్చుకో.. గణితం, సైన్సుపై అవగాహనే లక్ష్యంగా నూతన కార్యక్రమం
★ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 440 పాఠశాలల ఎంపిక.
★ ప్రాథమిక విద్యలోనే పిల్లలకు విద్య, వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) నిర్ణయం.
★ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే పిల్లలకు సైన్సు, గణితం సబ్జెక్టుల వైపు ఆకర్షితులను చేయటమే లక్ష్యంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్(రా) కార్యక్రమానికి శ్రీకారం.
★ దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు సాంకేతికతను జోడించి సైన్సు, గణితం అంశాలను వారికి వినూత్నంగా బోధించి ప్రతి పిల్లోడికి ఈ సబ్జెక్టుల పట్ల ఉన్న బిడియం, భయాన్ని తొలగిస్తారు.
★ రా కార్యక్రమాలు అమలు చేయటానికి కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇచ్చారు.
★ ఎంపికైన పాఠశాలల్లో రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభం.
★ జిల్లాకు 220 పాఠశాలల చొప్పున రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 440 ఎంపికయ్యాయి.
★ ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 1-8 తరగతుల విద్యార్థులకు ఇకమీదట నిత్యం గణితం, సైన్సుకు సంబంధించిన ఆయా అంశాలనువినూత్నంగా బోధిస్తారని సర్వశిక్ష అభియాన్ వర్గాలు వెల్లడి.