★ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు.
★ 10వ తరగతి హాల్‌టిక్కెట్టు, ఆధార్‌కార్డ్ నెంబర్, తల్లి లేదా తండ్రి, మొబైల్ నెంబర్‌తో ఇంటర్నెట్ సెంటర్లో జ్ఞానభూమి ఏపీజీవోవీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు సమర్పించాలి.
★ అర్హతగల అభ్యర్థులు ఏప్రిల్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
★ 2019 మార్చిలో పరీక్ష రాసిన విద్యార్థులు సొంతజిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
★ ఈ ఏడాది ఆగష్టు 31 నాటికి వయసు 17 సంవత్సరాల లోపు ఉండాలి.
★ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివి విద్యార్థులకు వయసులో ఒక సంవత్సరం మినహాయింపు ఉంటుంది.
★ ఈ నెల 13వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహణ.
★ తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో 100 మార్కులకు ఆబ్జెక్టు విధానంలో పరీక్ష నిర్వహణ.