APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori education
Showing posts with label education. Show all posts
Showing posts with label education. Show all posts
నవోదయ ఎంట్రన్స్‌లో కొత్త నిబంధనలు

నవోదయ ఎంట్రన్స్‌లో కొత్త నిబంధనలు

Mohan
APTF Updated at: January 05, 2023

సీబీఎస్ఈ పరీక్షల  తేదీలో స్వల్ప మార్పు

సీబీఎస్ఈ పరీక్షల తేదీలో స్వల్ప మార్పు

Mohan
APTF Updated at: January 01, 2023

  సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తాజాగా ప్రకటిం చింది. ఆ ఒక్క పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని, 12వ తరగతి మిగతా పరీక్షలు, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రక టించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.

UGC NET: యూజీసీ నెట్ డిసెంబర్ 2022  ప్రకటన  విడుదల

UGC NET: యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ప్రకటన విడుదల

Mohan
APTF Updated at: January 01, 2023

 దేశవ్యాప్తంగా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్ లెక్చరేషిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హతకు నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబరు 2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.


★ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.12.2022. 

★ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2023.

★ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10


☛ UGC-NET December 2022 Notification, Eligibility, Schedule, Online Application


https://ugcnet.nta.nic.in/


  • UGC NET December 2022 application







మర్చి 15 నుండి ఇంటెర్మీడియేట్ పరీక్షలు - టైం టేబుల్

Mohan
APTF Updated at: December 28, 2022

 


ఉపాధ్యాయ పోస్టుల  భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం  NTR district

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం NTR district

Mohan
APTF Updated at: December 24, 2022

  NTR district 

ఎన్టీఆర్‌ జిల్లాలో ఏపీ గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2022-23 సంవత్సరానికి 18 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకులాల జిల్లా కన్వీనర్‌ జాన్సన్‌ దేవరాజ్‌ తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సంవత్సరకాలానికి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు చేస్తున్నామని, ఆప్కాస్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులై, ఇంగ్లీష్‌ మీడియంలో ప్లస్‌-2 లెవెల్స్‌ చదివి ఉండాలని, ఆంగ్లంలో బోధన చేయాల్సి ఉంటుందని తెలిపారు. బోధించే పాఠశాల ఉన్న గ్రామంలోనే నివసించాలని, సెలెక్షన్‌ కమిటీ ద్వారా డెమో నిర్వహిస్తామని తెలిపారు. బాలి కల పాఠశాలలో మహిళలను, బాలుర పాఠ శాలలో పురుషులను మాత్రమే నియమిస్తామని, గురుకులం రూల్స్‌, రూల్స్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం నియమాకాలు ఉంటాయని, పేర్కొ న్నారు. విస్సన్నపేట బాలుర గిరిజన రెసిడె న్షియల్‌ పాఠశాలకు దరఖాస్తులు పోస్టు ద్వారా లేదా నేరుగా ఇవ్వవచ్చని చెప్పారు. వివరాలకు 94911 10211కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.


IGNOU BEd Admissions 2022-2023

IGNOU BEd Admissions 2022-2023

Mohan
APTF Updated at: December 21, 2022

  •  BEd(part time)ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది.
  • ప్రోగ్రామ్ period:2 years.ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలి.
  • Eligibility:1.Degree/PG with second class marks
  • 2.ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్న ట్రైనింగ్ అయిన టీచర్లు.
  • పరీక్షా విధానం:పేపర్ లో రెండు సెక్షన్స్ ఉంటాయి.
  • సెక్షన్ A: English, Logical Reasoning,General awareness and Teaching Aptitude
  • Section B : Selected Subject
  • దరఖాస్తు ఫీజు:1000రు
  • Last date :25thDecember 2022
  • Entrance test date:8 January 2023
  • Website:   http://www.ignou.ac.in/
  • Study centre: visakhapatnam
  •  అప్లై చేయుటకు December 25 వరకు  సమయం పెంచడమైనది గమనించగలరు.

జేఈఈ మెయిన్‌  సిలబస్‌ విడుదల

జేఈఈ మెయిన్‌ సిలబస్‌ విడుదల

Mohan
APTF Updated at: December 20, 2022

 జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షల సిలబస్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌ పేపర్‌లో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం మూడు విభాగాలు ఉంటాయి. జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 ఇంజినీరింగ్‌(బీఈ, బీటెక్‌) ప్రోగాంల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. పేపర్‌-2తో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రెండు విడతలుగా ఉంటుంది. బహుళ ఐచ్ఛిక విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పుడు సమాధానానికి మైనస్‌ మార్కులు ఉంటాయి. మెయిన్స్‌ను ఆంగ్లం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహిస్తారు

డిజి లాకర్‌లో పదో  తరగతి మెమోలు

డిజి లాకర్‌లో పదో తరగతి మెమోలు

Mohan
APTF Updated at: December 10, 2022

  •  డిజి లాకర్‌లో పదో తరగతి మెమోలు
  • 2017 నుంచి 2022 వరకు అందుబాటులోకి


రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి మార్కుల మెమోలను డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 2017 నుంచి 2022 వరకు చదివిన అభ్యర్థుల మార్కుల మెమోలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల ధ్రువపత్రాల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షల విభాగాలను.. మార్కుల జాబితాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం మొట్టమొదటగా పదో తరగతి మెమోలను వెబ్‌సైట్‌లో పెట్టింది. త్వరలో 2004 నుంచి ఉన్న డేటాను అప్‌లోడ్‌ చేయనున్నారు. అభ్యర్థులు ఎవరైనా తమ మెమోలను పోగొట్టుకుంటే డిజి లాకర్‌లోకి వెళ్లి పొందవచ్చు. ఆధార్‌ నంబరు నమోదు చేసి, సర్టిఫికెట్‌ను పీడీఎఫ్‌ రూపంలో పొందొచ్చని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ఆధార్‌ కార్డులోని పేరు, సర్టిఫికెట్‌లోని పేరు ఒకేలా ఉంటేనే ఈ సాధ్యమవుతుందని వెల్లడించారు.


APOSS - 2022 23 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో తత్కాల్ అడ్మిషన్స్ మరియు ఫీజు చెల్లింపులు అవకాశాన్ని కల్పిస్తూ షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులు విడుదల

Mohan
APTF Updated at: December 09, 2022

 APOSS- S.S.C & Intermediate courses-* Admissions and payments for the year-2022-23– Opportunity for Admissions of APOSS in Tatkal Dates communicated and Publicity– Issued - *Regarding


 ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి 2022 23 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో  తత్కాల్ అడ్మిషన్స్ మరియు ఫీజు చెల్లింపులు అవకాశాన్ని కల్పిస్తూ షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులు విడుదల




ఇక  9, 10 తరగతుల విద్యార్థులకే ప్రీ-మెట్రిక్‌ ఉపకార వేతనాలు  స్పష్టం చేసిన కేంద్రం

ఇక 9, 10 తరగతుల విద్యార్థులకే ప్రీ-మెట్రిక్‌ ఉపకార వేతనాలు స్పష్టం చేసిన కేంద్రం

Mohan
APTF Updated at: December 01, 2022

 విద్యా హక్కు చట్టం కింద ఎనిమిదో తరగతి వరకూ బాలలందరికీ తప్పనిసరిగా విద్యను అమలు చేస్తున్నందున ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి కేంద్రం పరిమితులు విధించింది. ఆ ప్రకారం ఓబీసీలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన తొమ్మిది, పదో తరగతి చదివే విద్యార్థులకే ఇక ఉపకార వేతనాలు అందనున్నాయి. 2022-23 సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ, మైనారిటీ వ్యవహారాలశాఖ ప్రకటించాయి. ఇప్పటి వరకూ 1 నుంచి 8వ తరగతి వరకు కూడా ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకం వర్తించేది.

జనవరి 8న సైనిక్  స్కూల్ ప్రవేశ పరీక్ష

జనవరి 8న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Mohan
APTF Updated at: December 01, 2022

 ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈ) వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహిస్తున్నట్టు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9 తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయస్సు 2023 మార్చి 31 నాటికి 10, 12 సంవత్సరాల మధ్య ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 13, 15 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. పరీక్ష రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దరఖాస్తు లను డిసెంబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్ లో పంపాలని కోరారు. ఇతర వివ రాల కోసం https://aissee.nta.nic.in వెబ్సైట్ను సంప్రదిం చాలని సూచించారు.

డీఈడీ-2020-22 బ్యాచ్ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 12 నుంచి 15 వరకు

డీఈడీ-2020-22 బ్యాచ్ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 12 నుంచి 15 వరకు

Mohan
APTF Updated at: November 26, 2022

 డీఈడీ-2020-22 బ్యాచ్ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. 2019 21 బ్యాచ్ అనుత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చని వెల్లడించారు. డీఈడీ-2021-23 బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులకు జనవరి 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. భాష పండితు(ఎల్పీటీ)లకు థియరీ పరీక్షలను జనవరి 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

SSC/OSSC/Vocational Fee due dates 2023

Mohan
APTF Updated at: November 22, 2022

 SSC EXAMINATION MARCH/APRIL - 2023 

  • WITHOUT LATE FEE :: 25-11-2022 TO 10-12-2022
  • WITH LATE FEE FINE OF Rs.50  :: 11-12-2022 TO 20-12-2022
  • WITH LATE FEE FINE Rs.200 ::  21-12-2022 TO 25-12-2022
  • WITH LATE FEE FINE Rs.500 :: 26-12-2022 TO 30-12-2022 
  • ONLINE SUBMISSION OF NR ALONG WITH OTHER DOCUMENTS :: 25-11-2022 TO 10-12-2022




ఆంధ్రప్రదేశ్ లో  పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం. GO.153 విడుదల చేసిన ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం. GO.153 విడుదల చేసిన ప్రభుత్వం.

Mohan
APTF Updated at: November 09, 2022

 G.O.MS.No.153 Home DT:20-10-22 Home Department Recruitment of 6511 Civil (PC + SI) and 4 I.R. Battalions (PC+ RSI) Strength (3895+ 2616) Administrative Sanction Orders Issued


ఆంధ్రప్రదేశ్ లో  పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం. GO.153 విడుదల చేసిన ప్రభుత్వం

 పోస్టులు: 6511


  నోటిఫికేషన్ మరియు పూర్తి వివరాలు

DEO గుంటూరు వారి పత్రిక ప్రకటన.. In-service B PEd course

Mohan
APTF Updated at: November 09, 2022

 


Inservice PETs into BPEd course for academic year 2022-23 to 2023-24

    All the Headmasters are requested to download the  proceedings of Inservice BPED training for the academic year  2022-23 to 2023-24  and go through the instructions and submit the applications if any to this office  immediately


Click here to Download Inservice B.ped application


డిగ్రీ ఉత్తీర్ణులూ  పీహెచ్డీలో చేరొచ్చు ... యూజీసీ కొత్త నిబంధనల జారీ

డిగ్రీ ఉత్తీర్ణులూ పీహెచ్డీలో చేరొచ్చు ... యూజీసీ కొత్త నిబంధనల జారీ

Mohan
APTF Updated at: November 09, 2022

 డిగ్రీ ఉత్తీర్ణులూ  పీహెచ్డీలో చేరొచ్చు📚✍️


♦️8 సెమిస్టర్ల కోర్సులో 75 శాతం మార్కులు రావాలి


 ♦️పీజీలో తొలి ఏడాది పూర్తి చేసినవారూ అర్హులే


♦️యూజీసీ కొత్త నిబంధనల జారీ


       : పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలు జారీచేసింది. దీని ప్రకారం 4 ఏళ్లు/8సెమిస్టర్ల బ్యాచ్‌లర్‌ డిగ్రీ కోర్సుల్లో 75 శాతం మార్కులతో పాస్‌ అయిన విద్యార్థులూ ఇకమీదట పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నాలుగేళ్ల డిగ్రీ తర్వాత మాస్టర్స్‌ డిగ్రీ(పీజీ) మొదటి సంవత్సరంలో 2 సెమిస్టర్లు పూర్తిచేసినవారు, మూడేళ్ల డిగ్రీ తర్వాత పీజీ కోర్సులో 2ఏళ్లు/4 సెమిస్టర్లు పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. 55 శాతం మార్కులతో ఎంఫిల్‌ పూర్తిచేసిన వారూ పీహెచ్‌డీలో చేరడానికి అర్హులే. ఈ అన్ని విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌క్రిమీలేయర్‌), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది. ఇకమీదట పీహెచ్‌డీ కాలపరిమితి కనీసం మూడేళ్లు, గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది. రీ-రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా గరిష్ఠంగా 2 ఏళ్ల అదనపు సమయం ఇస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీహెచ్‌డీ పూర్తికి 8 ఏళ్ల పరిమితి మించకూడదు. మహిళలు, దివ్యాంగుల (40శాతానికి మించి వైకల్యం ఉన్నవారు)కు మరో 2 ఏళ్ల పరిమితి ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఇలాంటివారు పీహెచ్‌డీలో చేరిన నాటి నుంచి పదేళ్లలో దాన్ని పూర్తిచేయడానికి వీలుంటుంది. మహిళా అభ్యర్థులు పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో 240 రోజులపాటు ప్రసూతి, శిశుపాలన సెలవులు తీసుకోవచ్చు.


▪️ యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌, గేట్‌, సీడ్‌ లాంటి జాతీయస్థాయి ప్రవేశపరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను పీహెచ్‌డీలో చేర్చుకోవచ్చు. లేదంటే ఉన్నత విద్యాసంస్థలు తాము సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి కూడా ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే ఆ పరీక్ష 50 శాతం రీసెర్చ్‌మెథడాలజీ, 50శాతం సంబంధిత సబ్జెక్టు ఆధారంగా ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో 50శాతం మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూలకు పిలవొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. అందుబాటులో ఉన్న పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచే స్వేచ్ఛ ఉన్నత విద్యాసంస్థలకు ఉంటుంది. ఆ సంస్థలు నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఉంటే ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులకు 70శాతం, ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభకు 30శాతం వెయిటేజీ ఇవ్వాల్సి ఉంటుంది.

SBI scholarship for students Last date 15.10.22

Mohan
APTF Updated at: September 11, 2022

 


ఓపెన్ స్కూల్ నందు 2022-2023 వ విద్యా సంవత్సరానికి పదవతరగతి & ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల.

Mohan
APTF Updated at: September 11, 2022

 


విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం • 6 నుంచి 11 వ తరగతి విద్యార్థులు అర్హులు

విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం • 6 నుంచి 11 వ తరగతి విద్యార్థులు అర్హులు

Mohan
APTF Updated at: September 11, 2022

 విద్యార్థి విజ్ఞాన్ మంథన్..


విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం • 6 నుంచి 11 వ తరగతి విద్యార్థులు అర్హులు • ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు.


దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 30


నమూనా పరీక్షలు: నవంబర్ 27 ,30


ఫలితాలు వెల్లడి : డిసెంబర్ 20 


రాష్ట్రస్థాయి పరీక్ష : 2023 జనవరి 5 , 15 , 22


జాతీయస్థాయి పరీక్ష : 2023 మే 20 , 21


కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ( ఎన్.సి.ఇ.ఆర్.టి ) , విజ్ఞాన భారతి , విజ్ఞాన్ ప్రసార్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 6 నుంచి 11 వ తరగతి ( ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ) విద్యార్థులకు ఆన్లైన్లో ఓపెన్ బుక్ పద్ధతి ద్వారా టెస్ట్ నిర్వహిస్తున్నారు . సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ , రాష్ట్ర బోర్డు విద్యార్థులు ఈ పోటీ పరీక్షకు అర్హులు . 


దరఖాస్తు ఇలా ..


రూ .200 చెల్లించి '  https://vvm.org.in/main వెబ్సైట్లో ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు చేసుకున్న వారికి జూనియర్ , సీనియర్ విభాగాల్లో నవంబర్ 1 న నమూన పరీక్షలు నిర్వహిస్తారు . ఇంగ్లిషు , హిందీతో పాటు తెలుగు మీడియంలోనూ పరీక్షకు హాజరయ్యే అవ కాశం ఉంది . 


పరీక్ష విధానం ....


గణిత , సామాన్య శాస్త్రం పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం అంశాలు , విజ్ఞాన శాస్త్ర రంగంలో దేశ కృషిపై 20 శాతం , శాస్త్రవేత్తల జీవిత చరిత్రకు సంబంధించి 20 శాతం , లాజిక్ , రీజనింగ్కు 10 శాతం బహుళై చ్ఛిక ప్రశ్నలు ఉంటాయి .


ప్రతిభ చాటితే ..


 పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలైతే ఆన్లైన్ ద్వారా ప్రశంసాపత్రం అందుకోవచ్చు . జిల్లా స్థాయిలో విజేతలైతే ప్రశంసా పత్రంతో పాటు వెబ్సైట్ లాగిన్ ఇస్తారు . ఆ లాగిన్ ద్వారా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనాలి . ఇందులో విజేతలైతే ధ్రువపత్రంతోపాటు జ్ఞాపిక అందిస్తారు . ప్రతిభ చాటిన ముగ్గురికి రూ .5 వేలు , రూ .3 వేలు , రూ .2వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు . జాతీయ స్థాయిలో సత్తా చాటిన ముగ్గురిలో ప్రథమ రూ .25 వేలు , ద్వితీయ రూ .15 వేలు , తృతీయ బహుమ తుల కింద రూ .10 వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు . దీంతోపాటు నెలకు రూ .2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకార వేతనం అందిస్తారు . దేశం లోని పరిశోధన సంస్థలను సందర్శించేందుకు కూడా అవకాశం లభిస్తుంది.

ఏకకాలంలో రెండు డిగ్రీలు చదవొచ్చు  మార్గదర్శకాలు జారీ చేసిన UGC

ఏకకాలంలో రెండు డిగ్రీలు చదవొచ్చు మార్గదర్శకాలు జారీ చేసిన UGC

Mohan
APTF Updated at: April 14, 2022

 ఏకకాలంలో రెండు డిగ్రీలు చదవొచ్చని వెల్లడించిన యూజీసీ బుధ వారం అందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది . వాటిని దేశంలోని అన్ని వర్సిటీ లకు పంపింది . విద్యార్థుల ప్రయోజనార్థం ఒకే సారి రెండు డిగ్రీలు చదువుకునే అవకాశం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని యూజీసీ ఆయా వర్సిటీ ఉపకులపతులకు లేఖలు రాసింది . మార్గదర్శకాల పేరిట కేవలం అయిదు అంశాలను మాత్రమే పేర్కొనడం గమనార్హం . ఇవీ మార్గదర్శకాలు శేఖర్ APTF * ఒక విద్యార్థి ఏకకాలంలో ప్రత్యక్షంగా రెండు పూర్తిస్థాయి కోర్సులు చదవొచ్చు . ప్రత్యక్షంగా రెండు చోట్ల చదవాలనుకుంటే తరగతుల సమయాలు వేర్వేరుగా ఉండాలి . * రెండు కోర్సులను ప్రత్యక్షంగా లేదా ఒకటి ప్రత్యక్షం- మరొకటి దూరవిద్య / ఆన్లైన్లో లేదా రెండు కోర్సులు కూడా దూరవిద్య / ఆన్లై న్ చేయొచ్చు . యూజీసీ / కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నత విద్యాసంస్థలు అందించే దూర విద్య / ఆన్లైన్ కోర్సులు చేస్తేనే రెండో డిగ్రీ చెల్లుబాటు అవుతుంది . * కొత్త విధానంలో అందించే కోర్సులకు యూజీసీ / ఇతర మండళ్ల నిబంధనలు వర్తిస్తాయి . ఆ సంస్థల నియం త్రణ ఉంటుంది . * యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ( ఏప్రిల్ 13 ) ఈ మార్గద ర్శకాలు అమల్లోకి వస్తాయి . ఇప్పటి నుంచి రెండు డిగ్రీలు చేస్తేనే చెల్లుతుంది . ఒకవేళ అంతకుముందు చేసినా అవి పనికిరావు 


Download Guidelines for Pursuing Two AcademicProgrammes Simultaneously



Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |