[06/06/2019, 15:30] అల్లంపాటి. సురేంద్రరెడ్డి: APTF NELLORE.
6.6.2019 ఋధవారం వింజమూరు లోని వేదవ్యాస ధ్యాన మందిరం నందు వింజమూరు డివిజన్ ముఖ్య కార్యకర్తల ఉద్యమ అధ్యయన తరగతులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి గారు , రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి,
జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి , ప్రధాన కార్యదర్శి సురేంద్ర, లు పాల్గొన్నారు. సభ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావూరి. సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు . ముందుగా జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ అధ్యయన తరగతులు యొక్క ఆవశ్యకతను, APTF విద్యా వైజ్ఞానిక మహాసభలు వజ్రోత్సవాలు గురించి వివరించారు.. విధానపత్రం నిబంధనావళి గురించి సుబ్బారెడ్డి గారు వివరించారు. ఫెడరేషన్ విస్తరణ గురించి, అవరోధాలు అధికమించడం గురించి
ఉపాధ్యాయ ఉద్యమాలు గురించి, పాలసీ విధానాలు గురించి సురేంద్ర గారు వివరించారు. Plan of action గురించి చిరంజీవి గారు వివరించారు. జిల్లా మాజీ అధ్యక్షుడు సుధాకర్ గారు, జిల్లా బాధ్యులు ఖాదర్ భాషా , చిన్న బాబు , కొండస్వామి రెడ్డి , వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కొండారెడ్డి, రవిచంద్ర, కొండయ్య , వెంకటేశ్వర్లు, భాస్కర్, ఖాదర్,శివకుమార్ , ప్రసాద్ రెడ్డి , మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.