APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF NLR
Showing posts with label APTF NLR. Show all posts
Showing posts with label APTF NLR. Show all posts
పెండింగ్ బకాయిలు విడుదల చేయించండి -  మంత్రి కాకాణిని కలిసిన ఎపిటీఎఫ్ శ్రేణులు

పెండింగ్ బకాయిలు విడుదల చేయించండి - మంత్రి కాకాణిని కలిసిన ఎపిటీఎఫ్ శ్రేణులు

Mohan
APTF Updated at: January 01, 2023

పెండింగ్ బకాయిలు విడుదల చేయించండి

నూతన సంవత్సర సందర్భంగా మంత్రి కాకాణిని కలిసిన ఎపిటీఎఫ్ శ్రేణులు 


నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎపిటీఎఫ్(1938) శ్రేణులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల విషయాన్ని  మాజీ APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K.వెంకటేశ్వరరావు మంత్రి దృష్టికి తెచ్చారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించి ఆర్ధిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూడాలని కోరగా ఆయన అంగీకరించారు. ఈ కార్యక్రమంలో  ఎన్ మోహన్ దాస్,Y. జనార్దన్ రావు ,యు సురేంద్ర,B, కాంతారావు ,ఎస్డి ఖాదర్బాషా, టీ .మస్తానయ్య మొదలగు వారు పాల్గొన్నారు


పెండింగ్ బకాయిలు,DA ల విడుదల కోసం APTF ధర్నా : నెల్లూరు జిల్లా

Mohan
APTF Updated at: December 27, 2022

 











నెల్లూరు జిల్లా పొదలకూరు ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం!

Mohan
APTF Updated at: March 21, 2022

రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం (255) కలిగివున్న నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం. ఏపీటీఎఫ్ వివిధ దశలలో నిర్వహించే సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం సాయంత్రం మండల కౌన్సిల్ జరిగింది. స్వల్ప మార్పులతో గత  మండల కమిటీని కొనసాగించాలని నిర్ణయం.
 అధ్యక్షులు: కె.లక్ష్మీ నారాయణ
ప్రధాన కార్యదర్శి:R. మాల్యాద్రి

రాష్ట్ర కౌన్సిలర్ కె. హజరత్తయ్య నూతన కమిటీకి ఎన్నికల అధికారిగా వ్యవహరించి ప్రమాణస్వీకారం చేయించారు.

ఆప్ లతో కుస్తీ బోధన నాస్తి వేధిస్తున్న యాప్ ల భారం. .APTF, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

Mohan
APTF Updated at: November 18, 2021

ఆప్ లతో కుస్తీ బోధన నాస్తి   వేధిస్తున్న యాప్ ల భారం.     .APTF, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ. సురేంద్ర రెడ్డి, ఎం.  పిచ్చి బాబు

రాష్ట్ర స్థాయి ఆందోళనను తలపించిన నేటి నెల్లూరు జిల్లా APTF:1938 ధర్నా

Mohan
APTF Updated at: November 03, 2021

 రాష్ట్ర స్థాయి ఆందోళనను తలపించిన నేటి నెల్లూరు జిల్లా APTF:1938 ధర్నా


- అధికసంఖ్యలో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయినులు


- జిల్లా మరియు జనరల్ సమస్యలపై గళమెత్తిన ఏపిటీఎఫ్


సిపిఎస్ రద్దు చేయాల్సిందే!- ధర్నాలో ఏపీటీఎఫ్ డిమాండ్


నెల్లూరు జిల్లా:

ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో  టీచర్ ను నియమించడం, 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపరాదని, యాప్స్ భారం తగ్గించాలని,  డీఈఓ పూల్ పండితులకు శాశ్వత స్థానాలు కేటాయించాలని కోరుతూ నెల్లూరు డీఈఓ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ చేపట్టిన ధర్నా విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి వందలాది ఉపాధ్యాయులు ధర్నాకు కదిలివచ్చారు.  ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న కరువు భత్యం బకాయిలు మంజూరు చేయాలని, పీఆర్సీ అమలుచేయాలని ధర్నా సందర్భంగా డిమాండ్లకు చేశారు, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని, వారికి చట్టబద్ధంగా రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల మెర్జింగ్ ను నిలుపుదలచేసి వాటిని బలోపేతం చేయాలని, మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు డీఈఓ కార్యాలయంలో అవినీతిని ఎండగట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ధర్నా శిబిరంకు వచ్చిన డీఈఓ ను కోరారు. 


ఒకవైపు వర్షం, ఎన్నికల కోడ్ నేపద్యంలో మరోవైపు ధర్నా నిర్వహిణను అడ్డుకొంటూ పోలీసుల వత్తిడి మధ్య ధర్నా ఉద్విఘ్నభరితంగా సాగింది. పోలీసులు ధర్నాను అడ్డుకున్నప్పటికీ కార్యాలయ ఆవరణలో ధర్నాను కొనసాగించారు.  ధర్నాకు జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి అధ్యక్షత వహించగా, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ హజరత్తయ్య అసోసియేట్ అధ్యక్షుడు రియాజ్, ఎన్జీఓ నాయకులు పెంచలరావు, వెంకటస్వామి నాయుడు ప్రసంగించారు.  మహిళలు పెద్దయెత్తున తరలిరాగా, పొదలకూరు కార్యకర్త జ్యోతి ఉద్యమ గీతాలు ఆలపించారు.




నేటి ధర్నా కు విచ్చేసిన ఏపీటీయఫ్ అనంతసాగరం మండల శాఖ


ధర్నా కు విచ్చేసిన ఏపీటీయఫ్ కలువాయి మండల శాఖ


ధర్నా కు విచ్చేసిన ఏపీటీయఫ్ గూడూరు పట్టణ  శాఖ







సిపిఎస్ రద్దు చేయాల్సిందే!- ధర్నాలో ఏపీటీఎఫ్ డిమాండ్

Mohan
APTF Updated at: November 03, 2021

సిపిఎస్ రద్దు చేయాల్సిందే!- ధర్నాలో ఏపీటీఎఫ్ డిమాండ్

  • ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో  టీచర్ ను నియమించడం, 
  • 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపరాదని, 
  • యాప్స్ భారం తగ్గించాలని,  
  • డీఈఓ పూల్ పండితులకు శాశ్వత స్థానాలు కేటాయించాలని కోరుతూ నెల్లూరు డీఈఓ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ చేపట్టిన ధర్నా విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి వందలాది ఉపాధ్యాయులు ధర్నాకు కదిలివచ్చారు.  
  • ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సిపిఎస్ రద్దు చేయాలని,
  • పెండింగ్ లో ఉన్న కరువు భత్యం బకాయిలు మంజూరు చేయాలని, 
  • పీఆర్సీ అమలుచేయాలని ధర్నా సందర్భంగా డిమాండ్లకు చేశారు,
  •  2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని, వారికి చట్టబద్ధంగా రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
  • ఎయిడెడ్ పాఠశాలల మెర్జింగ్ ను నిలుపుదలచేసి వాటిని బలోపేతం చేయాలని, 
  • మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
  • నెల్లూరు డీఈఓ కార్యాలయంలో అవినీతిని ఎండగట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ధర్నా శిబిరంకు వచ్చిన డీఈఓ ను కోరారు. ఒకవైపు వర్షం, ఎన్నికల కోడ్ నేపద్యంలో మరోవైపు ధర్నా నిర్వహిణను అడ్డుకొంటూ పోలీసుల వత్తిడి మధ్య ధర్నా ఉద్విఘ్నభరితంగా సాగింది. పోలీసులు ధర్నాను అడ్డుకున్నప్పటికీ కార్యాలయ ఆవరణలో ధర్నాను కొనసాగించారు.  ధర్నాకు జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి అధ్యక్షత వహించగా, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ హజరత్తయ్య అసోసియేట్ అధ్యక్షుడు రియాజ్, ఎన్జీఓ నాయకులు పెంచలరావు, వెంకటస్వామి నాయుడు ప్రసంగించారు.  మహిళలు పెద్దయెత్తున తరలిరాగా, పొదలకూరు కార్యకర్త జ్యోతి ఉద్యమ గీతాలు ఆలపించారు.










నెల్లూరు జిల్లాలో 3వ తేదీ ధర్నాకు సన్నాహక సమావేశాలు.

Mohan
APTF Updated at: October 31, 2021

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 3 లో తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేసేందుకు వివిధ  మండలాల్లో కార్యకర్తలు సన్నాహాలు కార్యక్రమాలు చేపట్టారు. వింజమూరు, ఆనంతసాగరం, ఆత్మకూరు పొడలకూరు తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు.

నెల్లూరులో ఏపీటీఎఫ్ ధర్నా నవంబర్ 3న

Mohan
APTF Updated at: October 26, 2021


ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల్లారా.....!
నమస్కారం
ప్రభుత్వాలు, పాలకులు సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగ పునాదులను కదిలిస్తున్నారు. పేద, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల పిల్లలు చదివే పాఠశాల లను నిర్వీర్యం చేస్తున్నారు. ఒకవైపు జనాకర్షక పధకా లను ప్రవేశపెడుతూ రెండో వైపున పనిచేసే ఉపాధ్యాయు లను చదువు చెప్పనివ్వకుండా వారి బాధ్యతలను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే వారు సహజ వాతావరణంలో చదువు చెప్పలేని పరిస్థితులను సృష్టిస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బదీస్తున్నారు. సకాలంలో ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు కాలదోషం పట్టించి ఆయా ఉపాధ్యాయ కుటుంబాల ఆర్ధిక స్వేచ్ఛను చిదిమేస్తున్నారు. కల్లబొల్లి మాటలతో, హామీలతో ఉపాధ్యాయుల ఆలోచనలను వక్రీకరిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారంటూ ప్రకటనలు గుప్పిస్తూ ప్రజల్లో వితండవాదన లకు ఆజ్యం పోస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయో గించే పేరుతో ఉపాధ్యాయులను నిత్యం *యాప్* లతో కుస్తే పట్టేలా చేస్తూన్నారు. ఒకవైపు కరోనాతో గత రెండేళ్లుగా బోధన కుంటుపడగా, పిల్లలను దారికి తెచ్చుకునేందుకు ఉపాధ్యాయులు మానసికంగా సన్నద్ధమౌతున్నవేళ ప్రభుత్వ చర్యలు నిరుత్సాహ పరుస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలపై ఉక్కుపాదం మోపుతూ, అధికారుల స్థాయిలో జరిగే చర్చలను అగౌరపరుస్తూ, నిర్ణయాలను తృణీకరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను మంట గలుపుతూ, శుష్కవాగ్దానాలతో కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి మన శక్తిని, పోరాటరూపాన్ని చూపించా ల్సిన అదును వచ్చింది. పోరాట కార్యక్రమాలకు రాకుండా, ఉద్యమాల్లో పాల్గొనకుండా ఏ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కరించబడలేదనే సత్యాన్ని గుర్తించండి. ఎన్నో పోరాటాల సాధించుకున్న ఎన్నో ప్రయోజనాలు మటుమాయమయ్యాయనే వాస్తవాన్నీ,  రావలసినవి నిలిచిపోయాయని గుర్తించండి.

 నవంబర్ 3 వ తేదీన  DEO office వద్ద APTF ధర్నా కు హాజరుకావాలని పిలుపునిస్తున్నాం.
-ఏపీటీఎఫ్ 1938, నెల్లూరు జిల్లా శాఖ


ఉపాధ్యాయులు యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు నవంబర్ 3 వ తేదీన DEO కార్యాలయం ధర్నా నోటీసును అందచేసిన APTF నెల్లూరు జిల్లా శాఖ

Mohan
APTF Updated at: October 20, 2021

Past President KVR addressing in a meeting at Nellore

Mohan
APTF Updated at: October 11, 2021


Sri K.Venkateswara Rao, APTF Senior leader, addressing in a retirement function in town hall , Nellore on 10-10-21

APTF అనంత సాగరo మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నెల్లూరు నూతన CMO భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం

Mohan
APTF Updated at: September 11, 2021

APTF అనంత సాగరo మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మన నూతన CMO భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం


నెల్లూరు జిల్లా కార్యకర్తల సమావేశంలో ఒక దృశ్యం

Mohan
APTF Updated at: August 24, 2021

నెల్లూరులో కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి

Mohan
APTF Updated at: August 24, 2021

నెల్లూరులో ఫ్యాప్టో ధర్నా అనంతరం జరిగిన ఏపీటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు శివరామిరెడ్డి.


FAPTO ధర్నా నెల్లూరు

Mohan
APTF Updated at: August 24, 2021

నెల్లూరు జిల్లాFAPTO ధర్నా కార్యక్రమం కు విచ్చేసిననెల్లూరు జిల్లా ధర్నా ఇంఛార్జి APTF1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కులశేఖర్ రెడ్డి గారికి స్వాగతం మరియు ఉద్యమాభినందనాలు.




నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద APSEC ఆధ్వర్యంలో NEP2020 ని అమలు చేయవద్దు అని నిరసన

Mohan
APTF Updated at: August 11, 2021

ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద APSEC ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో NEP2020 ని  అమలు చేయవద్దు అని, ఖాళీగా ఉన్న 25000 ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ విద్యార్థులు నిష్పత్తి 1:20 గా ఉండాలని మాతృ భాష లో ప్రాధమిక విద్య భోధన జరగాలి అనే డిమాండ్ల సాధన కు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారి లో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి గారు ,APTF Ex రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ K.వెంకటేశ్వరరావు గారు DTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమణయ్య గారు APTF రాష్ట్ర కార్యదర్శి శ్రీ S.చిరంజీవి గారు Advocate శ్రీ శివశంకర్ గారు PDSU సంఘం నాయకులు శ్రీ సునీల్ గారు APSEC జిల్లా కన్వీనర్ M.పిచ్చి బాబు, APTF మాజీ జిల్లా అధ్యక్షులు G.రమణయ్య గారు మరియు APTF నాయకులు sk.సుభాన్ గారు, Y జనార్ధన్ రావు గారు B.కోటేశ్వరరావు గారు, S.వెంకటేశ్వర్లు గారు, B.గణపతి గారు,Sk.ఖాదర్ భాష గారు, R. రఘు గారు శ్రీ నరసింహ రెడ్డి గారు.O. శ్రీనివాసులు గారు శ్రీ రామ మోహన్ గారు A.శ్రీనివాసులు గారు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.

ఏపీటీఎఫ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కులశేఖర్ రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు

Mohan
APTF Updated at: August 08, 2021

 ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీటీఎఫ్ 1938 మధ్యంతర కౌన్సిల్ ఎన్నికల్లో ఇప్పటివరకు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఉన్న కులశేఖరరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉద్యోగ విరమణకు ముందుగా ఇప్పవరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె. వెంకటేశ్వరరావు ముందస్తు రాజీనామా ద్వారా ఏర్పడిన ఖాళీని ఈరోజు భర్తీ చేశారు. అసోసియేట్ అధ్యక్షుడుగా సి హెచ్. దిలీప్ కుమార్ ను ఎన్నుకున్నారు. నూతనంగా రాష్ట్రకార్యవర్గంలో చేరిన వివిద జిల్లాల నాయకులకు, మిత్రులకు హార్దిక శుభాకాంక్షలు.

*APTF1938 NELLORE DISTRICT UNIT*

నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో సభ్యత్వ నమోదు ప్రారంభం. అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి మురళి, ఇతర నాయకులు.

Mohan
APTF Updated at: August 04, 2021

నెల్లూరు జిల్లా ఆనంతసాగరంలో ఏపీటీఎఫ్ కార్యాలయం ప్రారంభం.

Mohan
APTF Updated at: August 04, 2021

నెల్లూరు జిల్లా ఆనంతసాగరం మండలంలో బుధవారం ఏపీటీఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, జిల్లా కార్యదర్శి కరీం మొహిద్దీన్, రాష్ట్ర కౌన్సిలర్ ఆర్. వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు సుబ్బారెడ్డి, రియాజ్,  అధ్యక్షులు రమణారెడ్డి, సురేష్ కుమార్

బీటెక్ విద్యార్థిని తేజస్వినిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి.- ఉపాధ్యాయ ఐక్యవేదిక. సమాజం తలదించుకునేలా విద్యార్థినిల ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమెను హత్య చేసిన ఉన్మాది వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం గూడూరు టవర్ క్లాక్ వద్ద ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. నిందితుడు ముందుగానే నిర్దేశించుకున్న కుట్రలో భాగంగా విద్యార్థిని హత్య చేయడం జరిగిందని, ఇది సమాజానికి చేదు సంకేతాలు పంపుతుందని ఆయన అన్నారు. తాను నిర్దోషిగా బయటపడేందుకు తనకు నచ్చిన రీతిలో కట్టుకథలు అల్లుతూ కేసును తప్పుదారి పట్టిస్తున్నడని అన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి సత్వరం దోషికు శిక్ష విధించాలని ఆయన కోరారు. యుటిఎఫ్ నాయకులు రాదయ్య మాట్లాడుతూ విద్యార్థిని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోయడం దుర్మార్గపు చర్య అన్నారు. పి.డి జమీల మాట్లాడుతూ సమాజంలో ఆడబిడ్డలు కనీసం ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండటం సిగ్గుచేటు అన్నారు ఉపాధ్యాయ సునీత మాట్లాడుతూ కాలేజీ చదువులకు ఆడ పిల్లలు బయటకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నుండి ప్రభుత్వం తన చర్యల ద్వారా విముక్తి కల్పించాలని ఉపాధ్యాయిని సునీత అన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో జరుగుతున్న దుస్సంఘటనలు పరంపర గా కొనసాగడం పట్ల ప్రభుత్వం నిష్కర్షగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. ఉపాధ్యాయులు లీలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తేజస్విని హంతకులకు ఉరిశిక్ష పడేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై. మురళి, శివకుమార్, జైపాల్ రెడ్డి, ఎం రమణయ్య, అనిల్, చంద్రశేఖర్, రమణయ్య, షఫీ ఉల్హక్, టి. నారాయణ పిడి. కరీముల్లా, సి హెచ్ విజయలక్ష్మి, సురేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Mohan
APTF Updated at: July 05, 2021

2008 DSC అభ్యర్థులను కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన APTF నెల్లూరు జిల్లా శాఖ

Mohan
APTF Updated at: July 02, 2021




ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ దాస్ గారు , జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ హజరత్తయ్య , 2008 డిఎస్సీ నాయకుడు చిరంజీవి, నెల్లూరు రూరల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా సబ్ కమిటీ సభ్యులు ఖాదర్ బాషా పాల్గొన్నారు

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |