*
▪️ప్రత్యేక ఉపాధ్యాయ డీఎస్సీ పరీక్షను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
▪️షెడ్యూల్ ప్రకారం 19న పరీక్ష జరగాల్సి ఉండగా.. కొందరు అభ్యర్థులు చదువుకునేందుకు సమయం కావాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు విన్నవించడంతో ఈ మేరకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
▪️వయోపరిమితి సడలింపునిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొందరు దరఖాస్తు చేసుకున్నారు.
▪️వీరు తమకు చదువుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ కోరడంతో వాయిదా వేశారు.
▪️మొత్తం 602 పోస్టులు ఉండగా 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.