ఆనందవేదికను పాఠశాలలో అమలు చేయడానికి నిర్వహించవలసిన కార్యక్రమాలు.
💠25.6.2019 వ తేదీన ఆనంద వేదిక కార్యక్రమం పై శిక్షణ పొందిన డి ఆర్ పీ లు, ఎస్ ఆర్ పి లు వారి వారి పాఠశాలలో ఈ కార్యక్రమం అమలుపై సహా ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి.
💠27.6.2019 వ తేదీన రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ప్రాథమిక స్థాయి మరియు సెకండరీ స్థాయి డి ఆర్ పీ లు జిల్లా స్థాయిలో జరిగే అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలి.
💠29.6.2019 వ తేదీన డివిజనల్ స్థాయి లో జరిగే అవగాహన కార్యక్రమానికి మండల స్థాయి టీమ్స్ హాజరు కావాలి. మండల స్థాయి లో మండల విద్యాశాఖ అధికారి, యాక్టివ్ ప్రధానోపాధ్యాయుడు, యాక్టివ్ స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు సభ్యులుగా(4) ఉంటారు.
💠1.7.2019 వ తేదీన మండల స్థాయిలో నిర్వహించబోయే అవగాహన కార్యక్రమానికి ప్రాథమిక స్థాయి మరియు సెకండరీ స్థాయి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరు కావాలి.
ఈ శిక్షణా కార్యక్రమంలో డివిజనల్ స్థాయి లో శిక్షణ పొందిన మండల టీమ్ ఆర్ పి లు గా వ్యవహరిస్తారు
💠3.7.2019 వ తేదీన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి వారి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమం అమలుపై అవగాహన కల్పించాలి
💠4.7.2019 వ తేదీ నుండి పాఠశాలలో ఆనంద వేదిక కార్యక్రమమును ప్రధానోపాధ్యాయులు మరియు వారి సిబ్బంది అందరూ వారి వారి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాలి