APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » పాఠశాలల్లో ‘నోస్కూల్‌ బ్యాగ్‌డే’ కు శ్రీకారం

పాఠశాలల్లో ‘నోస్కూల్‌ బ్యాగ్‌డే’ కు శ్రీకారం

Posted by APTF 1938
» CSE GO
» Sunday, 30 June 2019



సృజన - శనివారం సందడి అమలు


*పిల్లల మనో ఉల్లాసానికి ప్రత్యేక కార్యక్రమం*


*🔸ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా 1 నుంచి 5 వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షించేందుకు వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు సృజన - శనివారం సందడి కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ప్రాఽథమిక పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులకు వారంలో ఒక రోజు పుస్తకాల బరువు తగ్గించి వారిలో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రంగ ప్రాఽథమిక పాఠశాలల్లో సృజన - శనివారం సందడి (నోస్కూల్‌బ్యాగ్‌డే) కార్యక్రమం అమలుకు సంబంధించిన విధి విధానాలను 2019-20 పాఠశాల విద్యాశాఖ ప్రాఽథమిక పాఠశాలల విద్యావిషయక క్యాలెండర్లో పేర్కొన్నారు.*
*🍁నోస్కూల్‌ బ్యాగ్‌ డే ఉద్దేశమిది*
*🔹ప్రాఽథమిక పాఠశాలల విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని కలిగించి వారిలో దాగి ఉన్న వివిధ రకాల సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయాలి. ప్రతినెలా మొదటి, మూడవ శనివారాలలో సృజన - శనివారం సందడి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆమలు చేయాలి. రోజువారి పాఠ్యబోధనలు కాకుండా ఈకార్యక్రమంలో కథ, పాట, అభినయం, బొమ్మలు గీయడం, రంగులువేయడం, బొమ్మలు తయారు చేయడం, ప్రదర్శించడం మొదలైన అంశాలుంటాయి. ఆయా రోజుల్లో పుస్తకాల సంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతినెలలో ఒకసారి, సృజన అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపించాలి.*
*🍁సృజన - శనివారం సందడి*

*🍁నాలుగు సెషన్లలో అమలు*
*🔹సెషన్‌-1: 1,2 తరగతులకు పాడుకుందాం అంశంలో అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు , జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు మొదలుగునవి పిల్లలతో పాడించాలి. 3,4,5 తరగతులకు సృజన అనే అంశంలో బొమ్మలుగీయడం, రంగలువేయడం, బంకమట్టి, క్లేవాక్స్‌ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు చేయడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ , ఒరిగామి, నాటికలు, స్ర్కిప్టులు, మైమ్‌, ఏకపాత్రలు, నాట్యం, అభినయం చేయాలి.*
*🔸సెషన్‌2 : 1,2 తరగతులకు మాట్లాడుకుందాం అను అంశంలో కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొ డుపు కఽథలు, పజిల్స్‌ , సరదా అటలు ఆడటం చేయించాలి. 3,4,5 తరగతులకు తోటకు పోదాం అంశంలో పాఠశాలల్లో సాగు చేస్తున్న బడి తోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం చేయాలి. పరిశుభ్రం చేద్దాం అంశంలో పాఠశాల అవరణ, తరగతి గదులు శుభ్రం చేసుకోవాలి.*
*🔹సెషన్‌ 3: 1,2 తరగతులకు నటిద్దాం అంశంలో నాటికలు, స్ర్కిప్టులు, మైమ్‌, ఏకపాత్రలు, నాట్య, అభినయం చేయడం , చూసి వద్దాం కార్యక్రమాలు. 3,4,5 తరగతులకు చదువుకుందాం అంశంలో పాఠశాల గ్రంఽథాలయంలో నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకోని చదవడం, చర్చించడం, కథలు చదవడం, రాయడం చేయాలి.*
*🔸సెషన్‌ 4: 1,2 తరగతులకు సృజన అంశంలో బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టి, క్లేవాక్స్‌ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు, మా స్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ, వరిగామి. 3,4,5 తరగతులకు ప్రాఽథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ అధికారి, కుటుం బ సంక్షేమ అఽధికారి, పోస్టాఫీసు, వ్యవసాయదారుడు, వ్యాపారి, మొదలైన వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించాలి.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |