ఏపీటీఎఫ్
శనివారం సాయంత్రం DEO గారిని కలిసి నెలవారీ పదోన్నతులు జరపాలని , DEO pool టీచర్లకు వెంటనే శాశ్వత స్థానాలు కేటాయించాలని , పెండింగ్ లో వున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. DEO గారు DEO Pool టీచర్లు ఫైల్ వెంటనే రన్ చేయాల్సిందిగా అక్కడికక్కడే కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వింజమూరు పాతూరు విషయం , వింజమూరు బాలికోన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం విషయం పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో APTF జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, రాష్ట్ర కౌన్సిలర్లు క్రిష్ణారెడ్డి , జుల్ఫికర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.