అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): పెన్షనర్లకు తాత్కాలిక భృతి వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృదయరాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో పే-రివిజన్ అమలు చేసిన క్రమంలో మంజూరు చేసిన తాత్కాలిక భృతి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక రోజు వ్యవధిలో మంజూరు చేసేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు తాత్కాలిక భృతి జీవో నెం.60 విడుదల చేసి 5 రోజులు అయినా, పెన్షనర్లకు మాత్రం విడుదల చేయలేదని తెలిపారు.