ఏపీటీఎఫ్ : నిన్న 16.8.19 న EHS మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో మేనేజ్మెంట్ కమిటి సంఘం ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకటేశ్వరరావు, జి.హృదయరాజు లు పాల్గొని అజెండాలోని అంశాలు మరియు ఇతర ప్రధాన సమస్యలపై మాట్లాడి ప్రాతినిధ్యంను సీఈఓ కు సమర్పించడమైనది.
ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) పేరు స్థానంలో ఇకనుండి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గా పిలువబడుతుంది.
ఈ సమావేశంలో చర్చించిన ప్రధానమైన అంశాలు:
- 👉 హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేయాలనే డిమాండ్ పై...
- 👉 గతంలో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను క్యూఆర్ కోడ్ సిస్టంతో నూతన హెల్త్ కార్డులను జారీ చేయనున్నది. డేటాబేస్ తో అనుసంధానం చెందిన ఈ న్యూ హెల్త్ కార్డుల వలన ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండును.
- 👉ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అమలుకు సుమారు 400 కోట్లు ఖర్చవుతుంది. 200 కోట్లు ప్రభుత్వం వాటా, 200 కోట్లు ఉద్యోగులు వాటా ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వద్ద నుండి 71 కోట్లు మాత్రమే చెల్లించబడుతుంది. దీనికొరకు స్లాబ్ రేట్ల ప్రకారం కాకుండా ప్రతి ఉద్యోగి బేసిక్ పే నుండి కట్టేలా నూతన స్లాబ్ రేట్లను తదుపరి స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు.
- 👉 మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కింద 2700 క్లెయిములు పెండింగ్‌లో ఉన్న కారణంగా ( కేవలం విద్యా శాఖ నుండి దాదాపు 1500 క్లెయిమలు) స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఒక్క నెల రోజుల్లో పరిష్కారం చేస్తారు. తదుపరి వచ్చే క్లెయిమ్ లన్నీ కేవలం 21 రోజుల్లోనే క్లియర్ చేయుటకు ప్రయత్నం చేస్తామన్నారు.
- 👉వన్ టైం మాస్టర్ హెల్త్ చెకప్ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు (జి.ఓ జారీ అయినా అమల్లో లేదు )
- 👉 పెండింగ్‌లో ఉన్న గురుకుల, మోడల్, ఎయిడెడ్, గ్రంథాలయ మరియు డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ఉద్యోగులందరికీ హెల్త్ కార్డుల మంజూరుకై కార్యాచరణ చేపడతారు.
- 👉ఇప్పటి నుండి ప్రతి మూడు నెలలకోసారి మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం రాష్ట్రం మరియు జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.
- 👉 క్రానిక్ డిసీజ్ లకి LOC ల మంజూరు కేవలం 3 రోజుల్లోనే విడుదల అయ్యే విధంగా కృషి చేస్తారు.
- 👉 జూన్ నెలతో ముగిసిన మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పెంపు ప్రతిపాదన సీఈవో ప్రభుత్వానికి పంపారు.
- 👉 కాలిపోయిన మెడికల్ బిల్స్ పై ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోవాల్సివుంది.
- 👉 ఏదైనా హాస్పిటల్ వారితో సమస్యలు ఉంటే ఈ క్రింది మెయిల్ కు సంప్రదించిన యెడల సీఈఓ గారు వెంటనే స్పందించగలరు.
ప్రభుత్వానికి EHS నుండి అందించిన ప్రతిపాదనలు:
- 👉 కేటగిరీల వారీగా కార్డుల మార్పులకు కృషి చేయుటకు అనుమతి.
- 👉 మెడికల్ రీయింబర్స్ మెంట్ పథకం కింద లక్షరూపాయల వరకు జిల్లా కేంద్రాల్లోని అనుమతి.
- 👉 హాస్పిటల్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి, హాస్పిటల్ లను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి వైద్యం అందించని హాస్పిటల్స్ పై తీవ్రమైన చర్యలు తీసుకునేలా అనుమతి.
- 👉 వన్ టైం హెల్త్ చెకప్ ను పూర్తిగా గవర్నమెంట్ భరించే విధంగా ప్రతిపాదన.
- 👉 త్వరలో EHS స్టీరింగ్ కమిటీ సమావేశం సి.యస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని..
ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ తో సహా EHS హెల్త్ స్కీమ్ డాక్టర్స్ టీమ్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ సోదర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- అధ్యక్షులు :కే. వెంకటేశ్వర రావు
ప్రధాన కార్యదర్శి : జి. హృదయరాజు ఏపీటీఎఫ్