ఒక SGT ఉపాధ్యాయుడు
18 సం!! స్కేలు,24 సం!! స్కేలు
కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత
పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు
కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా
వున్నాయా?
* జవాబు:*
ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి
అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!!
స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!!
ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు
24సం!! స్కేలు కోసం
గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు
పాస్ కావాలి.SA లకు
తమ 12సం!! స్కేలు కోసం GO,EO
పరీక్షలు ఉత్తీర్ణత
పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test
పరీక్షల నుండి
మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.
★ ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?
✍ G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా
డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి